సబ్ ఫీచర్

ఎండల్లో హాయ్..హాయ్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవి పేరు చెప్పగానే కాటన్ వస్త్రాలు గుర్తుకువస్తాయ. వేసవిలో పిల్లలకు సెలవులు రావడంతో ఎటైనా జాలీగా ట్రిప్స్ వేస్తారు. కొంతమంది పెళ్లిళ్లకు వెళ్లాల్సి వస్తుంది. మరి ఇలాంటి జాలీ ట్రిప్స్‌కైనా, పెళ్లి పేరంటాలకైనా సనే కాటన్ దుస్తులు ధరిస్తే వచ్చే హాయ పట్టువస్త్రాలతో కూడా రాదంటే నమ్మండి. ఈ కాటన్‌పై కలంకారి ప్రింట్స్, ఆర్గండి, వెంకటగిరి, గద్వాల్, ఆఫ్కో, పోచంపల్లి, నారాయణపేట, ఈరోడ్ కాటన్, రూబీ వాయిల్ కాటన్, కోటా కాటన్ చీరెలు, వాయిల్ చీరలు, ఇతర డ్రెస్సు మెటీరియల్స్ డిస్కౌంట్ సేల్స్‌కి బేనర్స్ కట్టి ఆకర్షిస్తాయి. అబ్బాయిలు లాల్చీలు, కుర్తాలు, పెంచెలు, లుంగీలు- ఇలా మగవారి వస్త్రాలు కూడా షోరూమ్స్‌లో అందుబాటులో ఉంటాయి. పెళ్లిళ్ళు పేరు చెప్పి ఖరీదైన జరీ చీరెలు ఎక్కువ కొనకుండా కాటన్ చీరలు కొని వాటికి తగ్గట్టుగా ఎంబ్రాయిడరీ, పెయింటింగ్ ఇత్యాది అలంకరణలతో వాటిని అలంకరించుకొని కట్టుకొంటే అటు అందమూ ఇటు శరీరానికి ఆరోగ్యమూ కలుగుతాయ. వేడికాలంలో ఖద్దరు బట్టలయితే ఏసి మాదిరి చల్లగా వుంటాయి. నేటికాలంలో సిల్కు కంటే కాటన్ దుస్తులే ఖరీదు ఎక్కువగా ఉండడానికి కారణం అదే. గంజిపెట్టి ఇస్ర్తి చేయడం, లేదా రోలింగ్ చేయడం లాంటివి ఈ కాటన్‌కు తప్పని సరి అయినా ఈ సీజన్‌లో వీటి వాడకం తప్పనిసరి. కాటన్‌వి పలుచనివి తప్ప, సింథటిక్ వస్త్రాలు కట్టుకోవడం శరీరారోగ్యానికి అంత మంచిథి కాదు. కాటన్ దుస్తులు ధరించడం తో ఆ కాటన్ దుస్తులు చెమటను పీల్చి, చెమటకాయలు రాకుండా కాపాడుతాయి. మగ్గంమీద చేనేత కళాకారులు ఎంతో కష్టపడి నేసిన వస్త్రాలను కొనడంవల్ల మన కుటీర పరిశ్రమలను ప్రోత్సహించినట్లు అవుతుంది. మన ప్రాచీన కళా సంపదను ప్రోత్సహించినట్లు అవుతుంది.

-ఎన్.వాణి