సబ్ ఫీచర్

అష్టలక్ష్మీ నమోస్తుతే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ నగరంలో విలసిల్లుతున్న అనేక దేవాలయాల్లో కొమ్మాదిలోని శ్రీ అష్టలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనారాయణస్వామి దేవాలయం విలక్షణమైనది. మధురవాడ దరి కొమ్మాదిలోని అన్నంరాజునగర్‌లో మార్చి 24, 2010లో ఈ దేవాల శంకుస్థాపన జరిగింది. శ్రీ స్వామి, అమ్మవార్ల శిలా విగ్రహాల్ని మహాబలిపురం నుంచి, ఉత్సవ విగ్రహాన్ని తిరుపతి నుంచి తీసుకువచ్చి ఆలయ నిర్మాణాన్ని 9 మాసాల్లో పూర్తి చేశారు. 2011 మే 5న దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. లక్ష్మీనారాయణస్వామి శంఖు, చక్ర, గదా, కమలధారుడుకాగా, అమ్మవారు కమలం వీణాధారిగా భక్తులకు ఆశీస్సులందిస్తుంది. స్వామి సన్నిధికి ఇరువైపులా అష్టలక్ష్మి అమ్మవార్ల దేవాలయాలు కానవస్తాయి. క్షేత్ర పాలకునిగా ఆంజనేయస్వామి కొలువైయున్నారు. ఈ దేవాలయ ధర్మకర్తలుగా అన్నంరాజు సత్యనారాయణమూర్తి రమాదేవి దంపతులు వ్యవహరిస్తున్నారు. టీటీడీ ఆగమ శాస్త్ర సలహాదారులు శ్రీ మాన్ చామర్తి జగ్గప్పలాచార్యస్వామి పర్యవేక్షణలో నిర్మాణం, ప్రతిష్ఠ జరిగింది. ప్రతి ఏటా దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు, శ్రావణమాస ఉత్సవాలు దీపావళి పర్వదినాన ధనలక్ష్మి పూజలు, కార్తీక మాస ఆరాధనలు, ధనుర్మాసంలో గోదా రంగనాథుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ వైభోగాన్ని కన్నులారా చూసి తరించవలసిందే. ప్రతి ఏటా ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు సామవేదం షణ్ముఖశర్మ ఈ ఆలయానికి విచ్చేసి తమ అమృత సమయ ప్రవచనాలతో భక్తుల్ని పారవశ్యంలో ముంచెత్తుతున్నారు. ఆలయ ప్రధానార్చకులు చామర్తి శ్రీ్ధరస్వామి, సహాయకులు రపంప్రసన్నస్వామి పర్యవేక్షణలో పూజాది క్రతువులు సాగుతున్నాయి. శ్రీ దేవాలయంలో ప్రతి పౌర్ణమి దినాన లక్ష్మీనారాయణులను విశేషంగా పంచామృతాభిషేకాలు నిర్వహించడం పరిపాటి. అష్టలక్ష్మీ హోమం, లక్ష్మీనారాయణ హోమం, అష్టలక్ష్మీవ్రతాలు, భక్తుల అదీష్టసిద్ధి జరుగుతున్నాయి. నిత్య గోత్ర నామార్చనలు, సువర్ణ పుష్పార్చనలు, కళ్యాణోత్సవాలు, భక్తుల కోరిక మేరకు జరిపిస్తున్నారు. ఈ దేవాలయ దర్శనం అభీష్ట సిద్ధి ప్రదాయకంగా భక్తులు విశ్వసిస్తున్నారు.
- సుబ్రహ్మణ్యం
(విశాఖపట్నం కల్చరల్)