సబ్ ఫీచర్

ఇంట్లోనే మానిక్యూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందానికి మెరుగులు దిద్దుకోవాలంటే పార్లర్‌ను ఆశ్రయిస్తారు. అదే తీరిక దొరికినప్పుడు రొటీన్‌కు భిన్నంగా పార్లర్‌కి వెళ్ళేకంటే ఇంట్లోనే అందానికి మెరుగులు దిద్దుకుంటే చాలా బాగుంటుంది. చక్కటి రిలాక్సేషన్, అలాగే మన అందాన్ని మనమే తీర్చిదిద్దుకున్నామనే తృప్తి కూడా లభిస్తుంది. దానికి తోడు పార్లర్‌కి వెళ్ళాలంటే బోలెడంత ఖర్చు. పార్లర్స్‌కి డబ్బులు తగలేసే కంటే కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ పాటిస్తూ మన అందానికి మనమే మెరుగులు దిద్దుకుంటే బాగుంటుంది కదూ!
ప్రతి ఒక్కరూ ముఖాన్ని పట్టించుకున్నంత ఇదిగా చేతులని పట్టించుకోరు. ఇలా నిర్లక్ష్యానికి గురైన చేతులు అందవిహీనంగా, అనారోగ్యంగా ఉంటాయి. అలాంటివారు సరైన పద్ధతిలో మానిక్యూర్ చేసుకుంటే చేతులు మళ్ళీ అందంగా, ఆరోగ్యంగా తయారవుతాయి.
ట్రిమ్
ముందుగా నెయిల్ క్లిప్పర్‌తో గోర్లను ట్రిమ్ చేసుకోవాలి. అలాగే గోర్లలో ఉన్న మట్టిని తొలగించాలి. గోర్లు పొడవుగా ఉంటే అపరిశుభ్రంగా ఉండే అవకాశం ఎక్కువ. అదీకాక గోర్లు చిట్లిపోయి విరిగిపోయే ప్రమాదం ఎక్కువ. అందుకని గోర్లను చక్కగా తీసేసి ట్రిమ్ చేసుకోవాలి. గోర్లను తీసేయడమంటే చిగుర్లవరకూ కాకుండా కొంతమేరకు ఉంచి ట్రిమ్ చేస్తే గోర్లు అందంగా ఉంటాయి.
నూనె మర్దన
క్యూటికల్ లేదా ఏదైనా నూనెను తీసుకుని గోర్లకు పూయాలి. తర్వాత చుట్టూతా ఉన్న మురికిని తొలగిస్తే సులువుగా వచ్చేస్తుంది.
నీళ్లలో..
నూనెను పట్టించి, మురికిని తొలగించిన తర్వాత చేతులను నీళ్లలో కొద్దిసేపు ఉంచాలి. ఒక వెడల్పాటి బౌల్‌లో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. దానిలో లావెండర్ ఆయిలో, ఆలివ్ ఆయిలో వేయాలి. ఇందులో వేళ్లను కొన్ని నిముషాలు ఉంచాలి.
బ్రష్
ముందుగా క్యూటికల్ స్టిక్‌తో గోరు చుట్టూతా ఉన్న మృత కణాలను తొలగించి క్యూటికల్స్‌ని వెనక్కి తోయవచ్చు. ఇది చాలా జాగ త్తగా చేయాలి. లేకపోతే చర్మానికి గుచ్చుకుని గాయమయ్యే ప్ర మాదం ఉంది. అలాగే మెత్తని కుచ్చు కలిగిన బ్ర ష్‌ను తీసుకుని గోర్లపై, చేతిపై నెమ్మదిగా రుద్దాలి.
మాయిశ్చరైజర్
మృతకణాలను తొలగించిన తరువాత చేతులకు మాయిశ్చరైజర్‌ను రాయలి. గోర్లకు నెయిల్ క్రీమ్ అనేది ఉంటే అదే రాయచ్చు. లేదా బాడీ మాయిశ్చరైజర్‌ను రాసినా సరిపోతుంది. ఇప్పుడు గోర్లను మీకు నచ్చిన షేప్‌లో ట్రిమ్ చేయాలి.
బేస్ కోట్
గోర్లను నచ్చిన షేప్‌లో ట్రిమ్ చేశాక ఇప్పుడు టా న్స్‌పరెంట్ బేస్ కోట్‌ను వేయాలి. ఇలా చేయడం వల్ల గోర్లరంగు నుంచి ఏవైనా ఇబ్బందులు ఎదురైనా వాటి నుంచి గోర్లను రక్షించుకోవచ్చు. అంతేకాకుండా బేస్ కోట్ వేసిన తరువాత నెయిల్ పాలిష్ వేస్తే అది ఎక్కువకాలం గోర్లపై నిలిచి ఉంటుంది. అంతేకాదు బేస్ కోట్ వాడంతో గోర్లు చిట్లిపోకుండా ఉంటాయి.
నెయిల్ పాలిష్
ఇదంతా పూర్తయ్యాక గోర్లకు రంగులు వేయడం చాలా ఆసక్తికర విషయం. వివిధ రంగుల్లో అలాగే ఫినిష్‌లలో అనేక రకాల పాలిష్‌లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. జెల్ ఫినిష్‌లను కానీ, మిర్రర్ ఫినిష్‌లను గానీ ఎంచుకుంటే చాలా బాగుంది. వీటిల్లో రకరకాల ఆప్షన్స్ కూడా ఉంటాయి. అంతే ఇంట్లోనే బ్యూటీపార్లర్‌లో చేసినట్లుగా మానిక్యూర్ పూర్తయ్యి చేతులు అందంగా మారిపోతాయి.

- విశ్వ