సబ్ ఫీచర్

సమష్టి కృషితో సత్ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వృత్తిపరమైన ‘ప్రొఫెషినల్ ప్యాషన్’ ఒకే రోజు తరగతి గతిలో అడుగుపెట్టగానే వచ్చేది కాదు. అది ఒక అవిచ్ఛిన్నమైన ఒక ప్రక్రియ. దానికి ఉపాధ్యాయుడే కారకుడని అనుకోవటం తప్పే. ఇందుకు తానెంత బాధ్యుడో తన పరిసరాలది కూడా అంతే బాధ్యత. భువనగిరి హైస్కూల్‌లో విద్యార్థుల అభిమానం, సహచర ఉపాధ్యాయుల హితబోధ, తల్లిదండ్రుల ఆదరణ, సమాజం సహాయం లేకపోతే నాకు ఆ ప్రొఫెషినల్ ప్యాషన్ రాకపోయేదనుకుంటా. అదేకాదు.. నారాయణపేటలో ఆ ఊరివారు నాపై చూపించిన ప్రేమ నా వృత్తిపై ఆసక్తికి నీరుపోసింది. సిద్ధిపేటలో ప్రతి అంగుళాన్ని ప్రేమించే స్థాయికొచ్చాను. నా విద్యార్థి పరీక్షల్లో కాపీ కొడితే భరిస్తానా నేను? కారణం ఆ విద్యార్థి భవిష్యత్తు చెడిపోతుందనే భయం. అదేమాదిరిగా సిద్ధిపేట కళాశాలలో పిల్లలు కాపీకి తెగిస్తే నా ప్రాణాన్ని అడ్డంపెట్టే స్థాయి ఎందుకొచ్చింది. అదే ప్రొఫెషినల్ ప్యాషన్. అదే మాదిరిగా నాగార్జునసాగర్‌లోని ఎ.పి. రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో నాకు పిల్లలు ఇచ్చిన మెచ్యూర్డ్ థింకింగ్ (పరిపక్వమైన ఆలోచన) లేకుంటే ఆ కాలేజీ ఈ స్థితిలో ఉండేదా? ప్రొఫెషినల్ ప్యాషన్ అనేది ఎంతో మంది సహకారంతో సాకారమయ్యే భవన నిర్మాణం వంటిది. ప్యాషన్ అనేది మనసు నుంచి రావాలి. అంతరంగం లోపలి నుంచి రావాలి. అది ఒక్కొక్క జీవకణాన్ని తాకాలి. పుట్టుకతో ఎవరూ కూడా ఫ్యాషినేట్ టీచర్ కాదు. దాని వెనుక ఎన్నో శక్తులు మనకు తెలియకుండానే ఉపాధ్యాయ వృత్తిలో మార్పు తీసుకువస్తాయి. ఉపాధ్యాయ వృత్తి జీవనోపాధి కోసం తీసుకున్నదే కావచ్చు. కానీ అది క్రమక్రమంగా ఎదిగి మనలో మార్పుకు కారణభూతమవుతుంది. ఒక ప్యాషినేట్ టీచర్‌గా రూపొందటానికి కొన్ని తరాల కృషి దాని వెనుక దాగి వుంటుంది. కొందరు తమలోని మార్పును గుర్తించకుండా ఒక దశలోనే ఆగిపోతారు. తరగతి గదిని నిర్మించడం వెనుక ఒక కల్చర్, శ్రమ, ఎన్నో శక్తుల సాయం మిళితమై ఉంటుంది. తరగతి గదిని తీర్చిదిద్దేది ఎవరో ఒక్కరు కాదు, అది సమష్టి కృషి.
దివ్యాంగుల మనోక్షేత్రం..
కొందరు ఏ కారణం వల్లనో దివ్యాంగులవుతారు. కానీ తరగతి గది మాత్రం వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎవరికి కొరత వుంటుందో దాన్ని తీర్చేందుకు తరగతి గదిని సిద్ధం చేయాలి. గతంలో దివ్యాంగులు పరాధీనులై ఉండేవారు. తరగతి గది వారినిపుడు విముక్తి చేసింది. దివ్యాంగులన్నది శరీరానికి తప్ప ఆలోచనలకు కాదనే ధైర్యం కూడా తరగతి గది ఇచ్చింది. దివ్యాంగులు ఇపుడు భారత పాలక రంగంలో పలు స్థానాల్లో ఉన్నారు. దివ్యాంగులను తరగతి గది తీర్చిదిద్దుతుంది. సౌంజ్ఞల ద్వారా, గుర్తుల ద్వారా పరిసరాలను జయించే ఆధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. తరగతి గది ఆ స్వేచ్ఛా పోరాటానికి సామాజిక దృక్పథం కలిగించింది. దివ్యాంగులు అన్నింటిలోనూ పోటీపడే స్థితికి రాగలిగారు. తరగతి గది శారీరకంగా బలహీనతలున్నవారిని ఉన్నత స్థాయికి తీసుకువస్తుంది. తరగతి గదికి సామాజిక దృక్పథం కలది కాబట్టి దివ్యాంగులకు ప్రత్యామ్నాయ పద్ధతులను ఆలోచించి వారిని సమాజంలో శక్తివంతులుగా నిలబెడుతుంది. అంగవైకల్యం ఎదుగుదలకు ప్రతిబంధకం కాదని ఆ వర్గానికి ధైర్యం కలిగించి మనోనేత్రంతో కొత్తచూపునిచ్చేది తరగతి గదే. విద్యార్థులు విద్యాహక్కును సమర్థవంతంగా ఉపయోగించుకునే విధంగా చూసే బాధ్యత ఉపాధ్యాయుడు తీసుకుంటే ఆ తరమంతా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు. తరగతి గది ఒక ఉత్ప్రేరకమైనది. ప్రేరణ కలిగించే మార్గం. తరగతి గది దివ్యాంగులకు విమోచనా సాధనం. దివ్యాంగుల స్వేచ్ఛా పోరాటానికి తరగతి గది ఒక ప్రేరకంగా పనిచేస్తుంది. సామాజిక న్యాయానికి తరగతి గది మాధ్యమంగా నిలుస్తుంది.

-చుక్కా రామయ్య