సబ్ ఫీచర్

కళ్లు అందాన్ని కోల్పోతున్నాయా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడితే ముఖం అందవిహీనమై పోయినట్లు, జీవితంలో ఏదో కోల్పోయినట్లు చాలామంది నిరాశ పడుతుంటారు. కళ్లు అందాన్ని కోల్పోతున్నాయంటే అందుకు అనేక కారణాలున్నాయని వైద్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. వయసు పెరగడం, ఒత్తిడి, మద్యపానం, ధూమపానం, గతి తప్పిన ఆహారపు అలవాట్ల కారణంగా కళ్లు కళావిహీనమవుతుంటాయి. ప్రతిరోజూ వీలైనన్ని ఎక్కువసార్లు పరిశుభ్రమైన నీటిని తాగితే ‘నల్లటి వలయాల’ సమస్య నుంచి ఉపశమనం పొందే వీలుంది. చర్మంపై పేరుకున్న టాక్సిన్లను తొలగించడంలో, కళ్ల చుట్టూ ఉప్పు సంబంధమైన అవశేషాలను తొలగించడంలో మంచినీరు ఎంతగానో దోహద పడుతుంది. ఆహారంలో ఉప్పు అధికంగా వాడడం వల్ల కూడా కళ్లు మగతగా ఉంటాయని పరిశోధకులు సెలవిస్తున్నారు. కళ్లు అందంగా కనిపించాలంటే ప్రత్యేకంగా ఎలాంటి మందులు వాడనవసరం లేదు. దాహంగా ఉన్నా లేకున్నా మంచినీటిని ఎక్కువసార్లు తాగుతుండాలి. ఇలా చేస్తే ఉదయం లేచిన వెంటనే మగత కళ్లు అనే సమస్యే ఉండదు. తగినన్ని నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడి చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. శరీరంలో హానికారక యాసిడ్లు, టాక్సిన్లు తొలగిపోతేనే ముఖం కాంతులీనుతుంది. కళ్ల కింద నల్లటి వలయాలు తొలగిపోవాలంటే వీలైనన్ని ఎక్కువసార్లు మంచినీళ్లు తాగడం తప్ప- మరో సులువైన మార్గం లేదని నిపుణులు సలహా ఇస్తున్నారు. *