కృష్ణ

భక్తులతో కిక్కిరిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, నవంబర్ 22: కార్తీక మాసం ఏకాదశి పర్వదినం కావటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి భక్తులు ఆదివారం వేలాదిగా విచ్చేసి మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకములు నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం 3గంటల వరకు భక్తులు బారులుతీరి స్వామివారి నాగపుట్టలో పాలుపోసి పాలపొంగళ్ళు, కేశఖండనలు, ఒడుగులు, చెవిపోగులు, అన్నప్రసాసనలు తదితర మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆలయంలోని పొంగలిశాల వసతులు చాలక పక్కనే ఉన్న జడ్‌పి పాఠశాల ఆవరణలో పొంగళ్ళు తయారు చేశారు. స్వామివారి శాంతి కళ్యాణం ఆలయ వేద పండితులు నౌడూరి విశ్వనాధ సుబ్రహ్మణ్య శర్మ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్లాంట్ సీనియర్ మేనేజర్ వి కిషోర్‌బాబు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన వెంట అవనిగడ్డ విజయకృష్ణ గ్యాస్ ఏజెన్సీస్ ప్రతినిధి మత్తి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ఆలయ ఏసి ఎం శారదాకుమారి పర్యవేక్షణలో సూపరింటెండెంటు ఎ మధుసూదనరావు, అధికారులు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు.

పరమ శివునకు రుద్రాభిషేకాలు
మచిలీపట్నం , నవంబర్ 22: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పట్టణంలోని శివాలయాలలో పరమ శివునకు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఈడేపల్లి శ్రీ కాశీవిశే్వశ్వర స్వామి, శ్రీ వెంకటాచల స్వామి(జోడుగుళ్ళు) ఆలయాల ప్రాంగణంలో మహాలింగార్చన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఖొజ్జిల్లిపేట శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం, రాబర్ట్‌సన్‌పేట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయం, సర్కిల్‌పేట, గొడుగుపేట, బచ్చుపేట శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయాలు, శంకరమఠం తదితర ఆలయాలలో భక్తులు కిటకిటలాడారు.

మన ఊరి పండుగగా శ్రీపాండురంగని ఉత్సవాలు
మచిలీపట్నం , నవంబర్ 22: చిలకలపూడి పాండురంగస్వామి ఉత్సవాలు మన ఊరి పండుగ అని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక చిలకలపూడి శ్రీ పాండురంగ స్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించిన విలేఖర్ల మావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించే విధంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం రథోత్సవం ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు విశేషంగా పాల్గొని హారతులిచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ రథోత్సవంలో పగటి వేషాలు, బుట్టబొమ్మలు, పులివేషాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన జరుగుతుందన్నారు. ప్రాచీన కళలకు సంబంధించిన కళాకారులు పాల్గొంటారన్నారు. ఈనెల 25వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రం వద్ద పుణ్య స్నానాలు ఆచరించే భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డ్వాక్రా మహిళల ఉత్పత్తుల అమ్మకాలకు స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, వైస్ ఛైర్మన్ పంచ పర్వాల కాశీవిశ్వనాధం, టిడిపి నాయకులు గోపిచంద్, ఇలియాస్ పాషా, కుంచే దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.