యువ

సక్సెస్‌కి బారామీటర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంతమంది తలచిందే తడవుగా పనుల్లో.. విజేతలవుతుంటారు. కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ దారి పట్టలేరు. అసలు సక్సెస్‌కి కొలమానం ఏమిటో సరిగ్గా నిర్వచించడమూ కష్టమే. తలచుకున్న పని, అనుకున్న గమ్యాన్ని చక్కగా చేరగలిగాననే భావమే నిజమైన విజయాన్ని కొలిచే విధానం. జీవితంలో మనం ఉన్న స్థానాన్ని బట్టి సక్సెస్‌ని కొలవలేరు. ఆ సక్సెస్ రావడానికి ఎన్ని అవరోధాలు అధిగమించాము అనే అంశాన్ని బట్టే విజయాన్ని కొలుస్తారు.
చాలామంది సక్సెస్ అయిన పర్సన్స్ తమ రికార్డులను తామే అధిగమిస్తుంటారు. వారికి పోటీగా వారినే తీసుకుంటారు. నిరంతరం తమ అభివృద్ధి కోసం కృషి చేసుకుంటారు. జీవితంలో మనం ఎంతటి ఉన్నత స్థానానికి వెళ్లాం అనేదానిని బట్టి సక్సెస్ ఉండదు. ఎన్నిసార్లు వెనుదిరిగాం, కింద పడ్డాం, ఓటమిని చవిచూశాం అనే దానిని బట్టే విజయం వుంటుంది. ఈ ఓటములనుబట్టే విజయం నిర్ణయించబడుతుంది. ఓటమి విజయానికి రహదారి. ఎన్నిసార్లు ఓటమి పాలైతే అంత సులువుగా విజయాన్ని పొందగలుగుతారు. చరిత్ర తిరగవేస్తే విజయగాథలుగల ప్రతి విజేతకు అంతకుముందు చాలా అపజయ గాథలు వుంటాయి. పబ్లిక్ ఎప్పుడూ ఆవైపు చూడరు. వారి దృష్టికి విజయాలు కనిపిస్తాయి. అది చూసి వారు చాలా అదృష్టవంతులని అనుకుంటారు. సరియైన సమయంలో సరియైన స్థానంలో వుండటంవలన విజయం సాధించాడని చెప్పుకుంటారు. అబ్రహాం లింకన్ జీవితంలో చాలా అపజయాలున్నాయి. అయితే ఆయన ఫెయిల్యూర్స్ అన్నిటినీ సక్సెస్‌కి రహదారిగా మలచుకోగలిగాడు కాబట్టే ఫైనల్‌గా ఆయన సక్సెస్‌కి బారామీటర్‌గా నిలిచాడు.
దూసుకుపోయే సూత్రాలు
- పరాజయం అంటే నువ్వు చేసిన పనిని వదిలి పారిపొమ్మనటం కాదు. ఆ పనిని మరింత శ్రద్ధగా, పట్టుదలగా చేయమని అర్థం.
- నిప్పును తలక్రిందులుగా పట్టుకున్నా దాని జ్వాల పైకే ప్రసరిస్తుంది. అలాగే కార్యశూరుడికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అతని ధైర్యం సడలదు.
-దేనినీ అడ్డంకి అనుకోవద్దు. ప్రతిదానినీ విజయాన్ని సాధించే ఓ మెట్టుగా భావించాలి. అసమర్థులు ఊహల్లో విహరిస్తే.. సమర్థులు వాటిని నిజం చేసుకునేందుకు కృషి చేస్తారు.
-ఆలోచన ఈరోజు, ఆచరణ రేపు- అన్న రోజున నీకు వర్తమానం తియ్యగా ఉంటుంది తప్ప భవిష్యత్ తీయగా వుండదు.
-మన ఆంతర్యాన్ని బట్టే ఆలోచనలుంటాయి. ఆలోచనలను అనుసరించి ఆచరణ వుంటుంది.
-గెలవాలన్న తపన తగ్గితే ఓటమి దగ్గరైనట్లే.
-తరచూ అవకాశాలు కోల్పోయేందుకు ముఖ్యకారణం నిర్ణయాలు వెంటనే తీసుకోలేకపోవటం.
-విజయం సాధించడంనుండి ఎవరూ నిన్ను మోసం చేయలేరు. నిన్ను నీవు మోసం చేసుకుంటే తప్ప...
-సామర్థ్యం కన్నా కష్టించి పనిచేయడం వల్లనే ఎక్కువ సక్సెస్‌లు సాధించగలం.

-పి.వి.రమణకుమార్