క్రైమ్/లీగల్

భార్య పిల్లలను హత్యచేసి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్: భార్యపై అనుమానంతో కుటుంబ సభ్యులను హతమార్చి తాను ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి ఉదంతం ఇది. ఆలహాబాద్‌లో మనోజ్ కుష్వాహ అనే వ్యక్తి తన భార్య వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను చంపి ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. కుమారుడిని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసి చంపాడు. ఇద్దరు కుమార్తెలను చంపి అల్మారలోని సూట్‌కేసులో పెట్టాడు. అనంతరం తాను ఉరేసుకుని చనిపోయాడు. సోమవారం ఎంతకూ తలుపు తీయకపోవటంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు తలుపులు బద్దలుకొట్టి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.