రంగారెడ్డి

రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేవెళ్ల, నవంబర్ 20: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేవెళ్ల మండలం ఆలూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అలూర్‌కు చెందిన సార సత్తయ్య(40) తనకున్న రెండు ఎకరాలతోపాటు, మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న, చామంతి పంటలను సాగు చేశాడు. అలూర్‌లోని ఎస్‌బిహెచ్ బ్యాంక్‌లో రూ.50వేలు రుణం, ప్రైవేట్‌గా మరో రూ.50 అప్పు తీసుకున్నాడు. వర్షాభావ పరిస్థితులతో పంటలు సరిగా పండక తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని ప్రతి రోజు కుటుంబ సభ్యులతో చెబుతూ మదనపడేవాడు. గురువారం సాయంత్రం ఇంటి నుండి బయటికి వెళ్లి రాత్రియైన తిరిగి రాలేదు. శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని బస్‌స్టేజీ వద్ద క్రిమిసంహారక మందు తాగి మృతిచెంది ఉన్నాడు.