ఆంధ్రప్రదేశ్‌

మంత్రి సుజనా ఇంటిముందు చీపుర్లతో నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపికి ప్రత్యేక హోదాను సాధించడంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి విఫలమయ్యారని ఆరోపిస్తూ ఆయన స్వగ్రామమైన వీరులపాడు మండలం పొన్నవరంలో బుధవారం ఉదయం కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సుజనా ఇంటి ముందు రోడ్డును చీపుర్లతో ఊడ్చి వారు తమ నిరసన తెలిపారు. మంత్రి పదవిని కాపాడుకునేందుకు సుజనాచౌదరి బిజెపితో కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. సుజనా, చంద్రబాబులకు వ్యతిరేకంగా వారు మాట్లాడారు. దీంతో కొందరు టిడిపి కార్యకర్తలు మంత్రి ఇంటి వద్దకు చేరుకుని రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ వారేనని వాదనకు దిగారు. సోనియాగాంధీ డౌన్‌డౌన్ అని వారు ఎదురుదాడికి దిగారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.