రాష్ట్రీయం

అంబేద్కర్‌ను స్మరించుకుందామంటే.. అడ్డుకుంటారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాల్‌మనీపై ఎప్పుడైనా, ఎంతసేపైనా చర్చకు సిద్దం
వైకాపాపై ధ్వజమెత్తిన మంత్రులు రావెల, పీతల సుజాత
హైదరాబాద్, డిసెంబర్ 17: దళితుల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌ను స్మరించుకుందామని, ఆయన శతజయంతి ఉత్సవాలను నిర్వహించుకునేందుకు సమగ్రంగా చర్చిద్దామని ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం అత్యంత హేయమైన చర్య అని అధికార తెలుగుదేశం పక్షం ధ్వజమెత్తింది. గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల సందర్భంగా మీడియా పాయింట్ వద్ద మంత్రులు రావెల కిషోర్‌బాబు, పీతల సుజాత, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, జూపూడి ప్రభాకరరావు, అనిత, యామినీబాల తదితరులు మాట్లాడారు. బిఏసి సమావేశంలో ఈరోజు అంబేద్కర్ శతజయంతి ఉత్సవాల అంశంపై చర్చిద్దామని, 18న కాల్‌మనీ వ్యవహారంపై చర్చిద్దామని చెబితే అంగీకరించిన వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ శాసనసభలో అంబేద్కర్ అంశాన్ని ప్రస్తావించగానే గోల గోల చేసి అడ్డుకోవడం దివాళాకోరు తనమని అన్నారు. కాల్‌మనీ వ్యవహారం గురించి ఎంపి కేశినేని నాని వద్దకు వచ్చి మహిళలు చెబితే ఆయన చొరవతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చిందని గుర్తు చేశారు. అసలు దీనికి మూలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచి వేసేందుకు ప్రయత్నిస్తుంటే దాన్ని పక్కకు నెట్టేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దూడల రాజేష్ ఈ కేసులో ప్రధాన నిందితుడు కాగా, అతనితో వైఎస్ జగన్‌కు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను మీడియా ముందు ఉంచారు. అంబేద్కర్ అన్నా, రాజ్యాంగం అన్నా వైకాపాకు ఏమాత్రం గిట్టడం లేదని, మూర్ఖత్వంగా, ఫ్యాక్షనిజాన్ని అసెంబ్లీలో చూపిస్తూ రౌడీయిజం చేయాలని ప్రయత్నిస్తున్నారని అధికార పక్షం ధ్వజమెత్తింది. దళిత వ్యతిరేకతను వైఎస్‌ఆర్‌సిపి ఈ సందర్భంగా బయటపెట్టుకుందని అన్నారు. అంబేద్కర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు సమగ్రంగా చర్చిస్తామని, శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బిఎసిలో ఒక మాట చెప్పి అసెంబ్లీలో ఒక రకంగా మాట్లాడి అసెంబ్లీని స్థంభింప చేస్తామని చెప్పడం వైఎస్‌ఆర్‌సిపి నీతిమాలిన రాజకీయానికి పరాకాష్టగా భావించాలని అన్నారు. సభా నాయకుడు చంద్రబాబు నాయుడు సభలో అంబేద్కర్ అని ఉచ్చరించగానే ఒక్కసారిగా గందరగోళం సృష్టించడం దారుణమని అన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను దోచుకున్న వైఎస్ రాజశేఖరరెడ్డి, కేంద్ర నిధులు వద్దని రాసిన వైఎస్ ప్రభుత్వానికి దళితులంటే ఎప్పుడూ చిన్న చూపే చూసిందని అన్నారు. ఇప్పుడు అంబేద్కర్‌పై చర్చకు అడ్డుపడి తమ దళిత వ్యతిరేక నైజాన్ని బయటపెట్టుకుందని అన్నారు. కాల్‌మనీ కేసులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ నేతలకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు నిగ్గు తేల్చడంతో ఏం సమాధానం చెప్పాల్సి వస్తుందోననే భయంతోనే ఈ అంశాన్ని ఇలా పక్కదారి పట్టించేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని అన్నారు.