సుమధుర రామాయణం

సుమధుర రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

620.ఇంద్ర సంతానమా వాయసమ్ము రామ
చంద్రు కీర్తించి తన దారి నరిగె దీని
వాచకాభిజ్ఞానమనుచు వసుధపుత్రి
దెల్పె హనుమకు స్వామికి జెప్పుమనుచు

621. హనుమ భక్తితో జానకి పాదములకు
మరల మరల ప్రణామము లాచరించి
సెలవు గైకొని యిక వీరి బలపరీక్ష
జేసి జనిన కార్యమ్ము సంపూర్ణమగును

622. అనుచు యోచించి పవమాన నందనుండు
సామదా భేద గుణము ల్వీరియందు
నిష్ప్రయోజనకరములౌ నంచు దలచి
దండ నీతియె వీరికి దగునటంచు

623. నందనవన సమానమై యసురపతికి
ప్రీతికర యశోకవనమ్ము నంత నిమిష
మాత్రముననె కళావిసానమ్మొనర్చె
పవన నందనుడసమాన బలయుతుండు

624.రత్నమండపములు లతాగృహములన్ని
నేల మట్టము జేయుచు నడ్డుపడిన
కింకరుల యమసదనము కంపి తనప
పరాక్రమము జూపె మిగిలినవారు వేగ

625.రాక్షసేశ్వరు కడకేగి మొరలుబెట్టు
కొనిరి ‘లంకేశ! ఒక మసానగచరమ్ము
వచ్చిమన యశోక వనముజరచి వసి
నడ్డుపడిన మమ్మందర నడచె దేవ

626. జూడ సామాన్యవౌ నగచరము గాదు
పరమ శివుని వాహనము నందీశ్వరుండౌ
లేక దేవతలంపిన దూతగాక
కపుల కింతటి బలపరాక్రమము గలదె’’

627. అనుచు కావలి వారలు మొరలుబెట్ట
క్రోధమున మండిపడి దశ కంఠు డంపె
వానరవధార్థ మెనుబది వేలమంది
కింకరులనరిగిరి సింహగర్జనలతో

628. శూరులౌ కింకర జన సైనమ్ము తనను
దాక వచ్చుట గని వాయునందనుండు
పర్వతాకారముగ మేను బెంచి యినుప
పరిఘ నొక్కటి చేబూని పలికె నిట్లు

629. ‘‘జయము జయము
రామ లక్ష్మణులకు వాన
రాధిపతి సుగ్రీవునకు జయమ్ము
శత్రు నాశనమ్ము శ్రమలేక జేసెడు
ఇనకులేశు డంప వచ్చినాడ

630. నన్ను మించిన శూరులు నగచరాధి
పతులు వత్తురు కోసల ప్రభుని గొల్చి
సకల రాక్షస సేనతో లంక గూల్చిన
సాగరములోన గల్పెద’’రంచు బల్కి

631. వనము నందున కార్చిచ్చు బడి దహించు
నట్లు మనుమంత డొక్కక్షణమ్ములోన
అనలజేతము తోడ నా సేననంత
భూమి బడునట్లు మర్దించి మడియ జెసె

632. అంత రావణుండు జంబుమాలిని బంప
నా ప్రహాస్త పుత్రుడేసినట్టి
బాణఘాతములకు యెఱ్ఱనై హనుమంతు
ముఖము వెలిగె వుదయ భానురీతి

633. పవననందనుండు కుపితుడై వానిపై
నొక్క ముద్గరమ్ము నంది విసరె
రధముతోడ వాడు ధరబడె పిండియై
రావణునకు జేరె వార్త యంత

634. సచివపుత్రుల నేడ్వుర బిలచి మీర
లేగి యాదుష్ట వానరమును వధంచి
రండటంచును రావణుడాజ్ఞ నీయ
వారలేగిరి దుశ్శకునములు గనుచు

635. శూల పట్టస తోమర అస్త్ర శస్త్ర
ములతొ నరుదెంచి తనపైని బాణవర్ష
మును గురియు మంత్రి సుత సప్తకమును హనుమ
క్రోధమున జూచి యంబర పధము కెగిసి

టంగుటూరి మహాలక్ష్మి