సుమధుర రామాయణం

సుమధుర రామాయణం -- యుద్ధకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1086. రామచంద్రుడు జూచి సుగ్రీవ రుూ వి
శాల దేహుడెవ్వడు మూడు లోకములను
నాక్రమించు ప్రాణి భువిని గలదటంచు
వినము మన మనగ విభీషణుండు దెల్పె

1087. రామ! యితడు నా కన్నయు రావణునకు
తమ్ముడీతని మించువాడసుర కులము
నందు లేడెవ్వడితనిది సహజశక్తి
జీవులను దినుచుండె పుట్టినది మొదలు

1088. భయముతో ప్రాణులు దివిజపతిని వేడు
కొనగ నింద్రు డీతని వజ్రఘాతు జేయ
వజ్ర ఘాతముదిన్న క్రోధమున నితడు
దేవ గజదంతమును లాగి నింద్రుగొట్టె

1089. బ్రహ్మశరణము జొచ్చె సురేంద్రుడంత
కుంభకర్ణుని బిలిపించి కమలగర్భు
డోరి! ప్రాణుల నాశమొనర్చు నీవు
మడిసినట్టులు పడియుండుమని శపించె

1090. వార్త విన్న లంకేశుడు వనజభవుని
దరికి జని తాత! తమరి శాపమ్మమోఘ
మితనికి దయతో నన్నపానము లనుగ్ర
హింపుడనుచు ప్రార్థింప మన్నించి యజుడు

1091. రావణాసుర యారుమాసముల కొక్క
దినము మేల్కొని ప్రాణిభక్షణము జేసి
మరల నిద్రించునితడని యానతిచ్చె
నిపుడు మేల్కొన వలసిన వాడుగాదు

1092. రావణుడు తన ఘోర పరాభవమ్ము
దలచి రుూతనినిపుడు మేల్కొలుప జేసె
మనము కపులకు యిది యంత్రమనుచు జెప్పి
ధైర్యము గలిగింతమనె విభీషణుండు

1093. ఉగ్రరూపుడై యుద్ధరంగమును జేరు
కుంభకర్ణుని బడగని కపులు వారి
సహజ గాంభీర్యములు వీడి చెదరి పరుగు
లిడిరి హోరుగాలికి దూదిపింజలవలె

1094. అప్పుడంగదుండు కపులనుద్దేశించి
భయము వలదు కైకశికి జనించి
నట్టి భూతగణమునందిది యొక్కటి
పారిపోవలదు భీతితోడ

1095. సంగరమ్మున గెల్చిన గలదు కీర్తి
ఈ నిశాచారులతొ పోరి మడియ నూర్థ్య
లోకములుగల్గు రుూపలలాశనుండు
కౌసలేయు కన్నులబడ నుసుర విడుచు

1096. అంగదుడు పేరు పేరున హరివరులను
బిల్చి దుష్టరాక్షసునకు భయముతోడ
నిట్లు సాధారణులవలె మీరు పారి
పో దగదన నంగదు వాక్యములకు కపులు

1097. ధైర్యవంతులై మరలిరి యుద్ధమునకు
వింధ్య నగమును పెనుగాలులవలె జుట్టు
ముట్టి వృక్ష మహశృంగముల బెకల్చి
విసరిరొక్కుమ్మడిగ నిశాచరునిపైన

1098. అన్నియును పిండి యయ్యెను కుంభకర్ణు
వక్షముం దాకి మరికొన్ని వానిచేత
త్రోయబడి మడిసిరి వేల తరుచరాళి
అసురసేనల హర్షనాదములు జెలగ

1099. కుంభకర్ణుని పిడికిట జిక్కి కపులు
పదులు వందలు నోటిలోబడి నలుగుచు
ముక్కుచెవుల రంధ్రమ్ముల నుండి బయట
వచ్చచుండుట కపి యూధపతులు జూచి

1100. గంధమాదనుండు శరభుడు శతబలి
ఋషభ పనసమైదరంభులాది
కీశవరులు శైలవర్షము గురిసిరి
కుంభకర్ణుపైన నొక్కమారు

1101. రాక్షసుని శూలమున పిండియయ్యెనన్ని
యసుర వీరుడు ద్రిప్పు శూలమ్మునుండి
యగ్ని బుట్టగ హరివీరు లదరిపడిరి
కపికులాధిపుడు సుగ్రీవుడొచ్చి నిల్చె

1102. కుంభకర్ణ! మాయూధపడులతొ నీవు
సల్పినట్టి సంగరమెంతొ మెప్పువచ్చె
మన యిరువురి బలాబలంబులను జూచు
కుందమని మహాగిరి బెల్లగించి విసరె

1103. కుంభకర్ణు గుండెనుందాకి గోత్రకూ
టమ్ము ముక్కలై ధరిత్రి బడియె
రవిజు మెచ్చుకొనుచు రాక్షసుడతి క్రోధ
మూర్తియై త్రిశూలమంది విసరె

1104. వచ్చు శూలము మధ్యనే వొడిసిబట్టి
రెండు తునియలు జేసె కేసరిసుతుండు
హర్షమున కపుల్ కొనియాడి రాంజనేయు
అంత ఘటకర్ణుడు ఘనశైలమ్ము విసరె

1105. సూర్యజుడు శైల తాకిడికొరిగె మూర్ఛ
తక్షణము కుంభకర్ణుడా తరుచరేశు
నెత్తుకొని లంకకేగె రాక్షసులు జేయు
జయజయ నినాదములు నలుదెసల నిండ

--టంగుటూరి మహాలక్ష్మి