సుమధుర రామాయణం

సుమధుర రామాయణం--యుద్ధకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1206. అష్టహరులను బూన్చిన రధమునెక్కి
దుందుభి ధ్వానముల దిక్కులదురుచుండ
గ్రీష్మభానునివలె నరుదెంచుచున్న
నా మహావీరు లంకాదినాధుజూచి

1207. గుండియలుజార హరిసేన కంపమొందె
నలుడు నీలుడు తారులుబూని వారి
ధైర్యవంతులజేసి రారంభమయ్యె
తుములు సమరము యిరుపక్షములకు నపుడు

1208. రావణుని శరవహ్నిలో వనచరాళి
మిడుతలౌటను జూచెను మిత్రసుతుడు
గండశిలలతో శరములు పిండిజేసె
తరుల గిరులను విసరిరి యూధపతులు

1209. అసుర సేనలు హతవౌట జూచి మత్త
గజముపై విరూపాక్షుడు కదనభూమి
కేగి శరపరంపరలతో కపుల గప్పె
మిత్రసుతు శైలమున చూర్ణమయ్యెనన్ని

1210. వజ్ర సదృశవౌ కరవాల హస్తుగౌచు
వానరేశ్వరు మీదికి రాగవైరి
గుండె ముష్టితో పొడిచె సుగ్రీవుడంత
రక్తము గ్రక్కుకొని విరూపాక్షుడీల్గె

1211. అంతట మహోదరుడు విజృంభించి కీశ
పతుల హింసించుచుండ కిష్కింధ రేడు
సాటిలేని శౌర్యమున ఖడ్గమ్ము బూని
నా మహోదరు శిరమును నరికెనపుడు

1212. ఆవల నరుదెంచె మహాప్రతాప శాలి
పుడమిదర మహాపార్శ్వుడాహవమున
కంగదు దశని వలె వాని రధముపైకి
దూకి చెవులపై చరచ కండ్లూడి మడిసె

1213. జూచి రావణుడగ్ని గోళమ్ములవలె
మండు నేత్రములతొ రధ మధివసించి
భూమి యదరగ సమరాంగణమ్ము కేగి
విడిచె తామకాస్తమ్రు కపివీరులదర

1214. రాఘవుండొనర్చె ధనుష్ఠంకార మపుడు
లక్ష్మణుండును దనువుచేబూని నిల్చె
సూర్య చంద్రులవలెనున్న దాశరధుల
యెదుట రాహువువలెనుండె దశముఖుండు

1215. రావణుండు ప్రళయకాల కాలునివలె
వానరాక్షౌహిణీసేన వాహినులను
శరపరంపర ధ్వంసముజేసి రామ
చంద్రుని లలాటమున శరత్రయమువేసె

1216. రామచంద్రుని నీలపు మోము రక్త
కమలమై వికసింపగ కౌసలేయు
డేసిన శరత్రయమ్ము రావణు ముఖమ్ము
జీల్లుకొనివచ్చి వసుధలో జొచ్చెవేగ

1217. రావణుండాసురాస్తమ్రు వేయదాని
రామ పావకాస్తమ్రు నిరోధించె రాక్ష
సేశ్వరుని వేరొకాస్తమ్రు వేలకొలది
మారణాయుధములను సృష్టించి రాగ

1218. రామచంద్రుడు గాంధర్వ నామకమను
అస్తమ్రు ప్రయోగించి భగ్నమ్మొనర్చె
రామ రావణులస్తశ్రస్త్రాష్ర నిపుణు
లిర్వురు విజయకాంక్షులై పోరుచుండ

1219. రావణుడు విజృంభించి వింశతికరముల
కపుల గదలమోదుచు నంత మొందజేయ
లక్ష్మణుండలుకను శత్రురధ పతాక
యశ్వసారధులను గూల్చె శౌర్యధనుడు

1220. వేరొకమ్మున దునిమె లంకేశు ధనువు
రావణుడు వజ్రసమశక్తి విసర నదియు
మంట లెగయుచువచ్చి సుమిత్ర సుతుని
గుండెలో దిగె రామానుజుండుగూలె

1221. రామచంద్రుడు కన్నుల నశ్రులొలక
తమ్ముగుఱ్ఱని దరిజేరి తానె రెండు
హస్తముల భక్తిని వెలికిదీసి విరిచి
బారవైచి సుగ్రీవుతో బల్కెనిట్లు

1222. ‘‘వానరేశ్వర! మీరంత వీని నప్ర
మత్తులై గాచుచుండుడు యిపుడెనేను
రావణు వధించి వచ్చెద రావణుండొ
రాముడో నొక్కరే మిగులుదురటంచు

1223. అనుగు తమ్ము దయా శోకవీక్షణముల
రౌద్రదృక్కుల లంకాధినాధు గాంచు
రామచంద్రుని వానరుల్ హర్షశోక
మగ్నులైగాంచి రచ్చెర్వు తోడనపుడు

1224. రామకోదండ నిర్ముక్త బాణ ధాటి
కసుర నాధుడు ప్రళయకాల ప్రచండ
వాయువేగానికి చెదర మేఘమువలవె
యుద్ధ్భూమిని వీడి పురమ్ము జొచ్చె

1225. రఘువరుడు తమ్ముదరిజేరి దుఃఖసాగ
రమ్మున మునుంగగ సుషేణు డాంజనేయు
తో తనయ నీవు మరొకమారౌషధులను
దేవలయునన ఉత్తరక్షణమె హనుమ

--టంగుటూరి మహాలక్ష్మి