సుమధుర రామాయణం

సుమధుర రామాయణం--యుద్ధకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1286. త్రికరణమ్ముల నినె్న ధ్యానించు నీమె
వనితలందున రత్న మీవసుధపుత్రి
యనుచు సీతను స్వర్ణ పద్మాసనమున
దెచ్చి రాముని కర్పించె హుతవహుండు

1287. రాముడంతటి బ్రహ్మరుద్రాది దేవ
తలకు వందనములిడి త్రిలోక వంద్యు
లార! జానకి కల్మషరహిత యంచు
నేనెరుంగుదు జగములు నమ్ముకొరకు

1288. సర్వధా! సత్యమున ప్రవర్తించు నేను
సీతయగ్ని ప్రవేశము జేయుచుండ
నామె శీలపవిత్రత లోకములకు
వెల్లడింప నుపేక్షించి పలుకనైతి

1289. అంత శ్రీయఃపతియగు శ్రీరామచంద్రు
డవనిజా హస్తకమలము సంగ్రహించి
మానినీమణిని తన వామాంకమందు
జేర్చుకొని సఫల ప్రతిజ్ఞుండునయ్యె

1290. స్వర్గమున నుండి మీ తండ్రి వచ్చె రామ!
జూడుమని బ్రహ్మజూపింప భక్తితోడ
కరములను మోడ్చి తండ్రికి మ్రొక్కులిడిరి
రఘుపతిని రాజు కౌగిటజేర్చు కొనియె

1291. సంతసముగల్గె రామ! నీ సత్యవాక్య
పాలనకు నిక సతితో నయోధ్యకేగి
లోకవాసల తమ్ముల కన్నవారి
జేయుము కృతార్థులనని దీవించిజనియె

1292. అనిమిషపతి యంజలి బద్దుడౌచు రామ!
అసుర వల్లభు దశకంఠు సంహరించి
మమ్ము రక్షించితివి నీదు దర్శనమున
సంతసించియు నర్పింతు మేదియైన

1293. దివిజ వల్లభ! నా కొరకై దురమున
ప్రాణముల లెక్కజేయక పోరుసల్పి
వానరులు మరణించిరి వారి తిరిగి
జీవితులజేయ బల్కె సీతావిభుండు

1294. ఇంద్రు వరమున కపులెల్ల నిద్రనుండి
మేల్కొనినయట్లు లేచిరి మొదట కంటె
నధిక బలవంతులై స్వస్తదేహములను
రామ సంకీర్తనలతోడ గంతులిడిరి

1295. బ్రతికియున్నట్టి తమతమ బంధువులను
ప్రీతి నాలింగనమ్ముల ముంచిరపుడు
రామ సేవకు లెన్నడు గాసిపడరు
నిత్యసంతోషులై మనుచుందురెపుడు

1296. బ్రహ్మరుద్ర సురేంద్రులు భానువంశ
వర్ధనునకు వందనములొనర్చి వారి
వారి లోకములకు నేగ రాఘవుండు
గడిపె నారాత్రి మిత్రులతోడ గలసి

1297. భానుడుదయించగ విభీషణుండు రామ
భద్రునకు మ్రొక్కి వినయము తోడ ననియె
మంగళ స్నానమొనరించి వస్త్ర భూష
ణములు ధరియించి యరుగు డయోధ్యరామ!

1298. అనగ మిత్రమా నాకొరకై భరతుడు
వేచి యుండు వేగమె నేనయోధ్యకేగి
భరతునితో మంగళ స్నానమున్నొనర్తు
సత్కరింపుము వానరపతులనీవు

1299. రాము నభిమతమున వానర ప్రముఖుల
కెంతో విలువైన వస్తభ్రూషణము లొసగి
అందరను సత్కరించి రాఘవుని ముందు
పుష్పక విమానమును దెచ్చి వుంచెనంత

1300. వానరాధిపులతొ విభీసణుడు రామ
భద్రునకు మ్రొక్కి ‘‘రాఘవా! మీతొ మేము
వచ్చెద మయోధ్య తమరి పట్ట్భాషేక
మునక’’ నగ ప్రేమ నంగీకరించె విభుడు

1301. సూర్యజ విభీషణ హనుమ జాంబవంత
యంగదాదులు వెంటరా సకలవాన
రులతొ సీత సౌమిత్రుల కరములన్గ్ర
హించి పుష్పకము నధిరోసించె విభుడు

1302. జానకీ లక్ష్మణ సహితుడైన రాము
డంబుజాసనువలె ప్రకాశించె నంత
పుష్పకము వాయు వేగముతోడ పసిడి
కాంతులను జిమ్ముచు నెగసె నాకసముకు

1303. రామచంద్రుడు దారిలో ధర్మపత్ని
తో ప్రియసఖి చూడుమిచటె సీత! నేను
రావణునతని తమ్ముడు కుంభకర్ణు
సంహరించితి కీశులసాయమునను

1304. అదెమహాసాగరమ్ముపై కపులు తోడు
పడగ నలుడు నిర్మించిన సేతువు సఖి
ఇచ్చట విభీషణుడు నన్ను శరణువేడె
ననుచు సీతకు జూపించె రఘువరుండు

1305. భూమిజా! ఋష్యమూక పర్వతము నిదిగో
శీతలజల పంపాసరోవరము నదియె
ఘోర రక్కసుని కబంధు గూల్చితిచట
నిచట ఖరదూషణాదులు నిహతులైరి

విశ్వ చైతన్యం-4

వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంత అద్భుతంగా వివరించారో బ్రహ్మజ్ఞానాన్ని! కండ అంటే మాన శరీరం. కుండ అంటే మణిపూరకం. కుండలినీ అంటే ఆత్మశక్తి-జీవాత్మ. ధ్యానం చేస్తూ ఉంటే, బోధిస్తూ ఉంటే మన కుండలినీ శక్తి మణిపూరకానికి చేరుకుంటుంది.
నిండిన ఒక జలాశయంలా తయారై అక్కడినుండి మన ఆత్మప్రయాణం ఇక రెండు తాచుపాములు సృష్టికార్యం చేస్తున్నట్లు ‘2 డిఎన్‌ఎ’గా ప్రయాణం కొనసాగించి ఆపై క్రమంగా అనాహతం చేరుకుని వౌనమై, తేలిక అయి విశుద్ధం చేరుకుని శుద్ధ వాక్కుగా మారుతుంది. ఆ తర్వాత ఆజ్ఞాచక్రంలో ఆజ్ఞ అయి తదుపరి సహస్రారంలో పడగబట్టి నాట్యం చేస్తుంది. ఆధ్యాత్మిక ఉన్నతి పొంది చక్రవర్తిలా!
అగస్త్య మహర్షి సప్త సముద్రాల నీటిని మ్రింగి తన మణిపూరక చక్రం (కడుపు)లోఎలా నింపగలిగాడు? అంతటి అక్షయకుండ - ఎలా సాధ్యమైందిః సాధన మరి బంధన మన సాధనాశక్తి అవగాహన అనుభవాలతో అనుభూతి ఎంతగా చెందుతూ ఉంటే మన ఆత్మ ప్రయాణం (కుండలినీ ప్రయాణం) అంతగా జరుగుతూ ఉంటుంది. అర్జునుడిని గుడాకేశుడు అని సంబోధిస్తాడు శ్రీకృష్ణుడు. గుడాకేశుడు అంటే నిద్రపోనివాడు. తస్మాత్ యోగీ భవార్జున అని బోధిస్తాడు నారాయణుడు నరునికి. అర్జునుడు నరుడు శ్రీకృష్ణుడు నారాయణుడు. అర్జునుడు రాత్రిళ్లు తెల్లవార్లూ యోగసాధన మరి అస్త్ర శస్త్ర సాధాన చేసేవాడు నిరతమూ నిరంతరమూనూ.
ద్రోణాచార్యుల ప్రియశిష్యుడు అర్జునుడు. అస్తశ్రస్తవ్రిద్యల్లో అర్జునుడిని ఆరితేరిన విలుకానిగా తయారు చేశాడుద్రోణుడు. అశ్వత్థామ ద్రోణుని కుమారుడు. అతడు తండ్రి నుండి అర్జునుడిలా అన్ని అస్తశ్రస్తవ్రిద్యలూ నేర్చుకున్నడు. ‘బ్రహ్మాస్త్రం’ ప్రయోగించే విద్య తో సహా. అయితే బ్రహ్మాస్త ఉపసంహార విద్యను అర్జునుడు నేర్చుకోగలిగాడు. అశ్వత్థామ మాత్రం మరి ఏ కారణం వల్లనో అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ఉపసంహార విద్య నేర్చుకోలేకపోయాడు. అపుడు తండ్రి తో అశ్వత్థామ ఇలా అన్నాడు. ‘పితృదేవా! మీరు అర్జునుడిని మీతో సమానమైన స్థాయిలో విద్యలన్నీ నేర్పారు. నేను మరికొంత కింద ఉన్నాను కనుక నాకు ఏదైనా ఒక అస్తవ్రిద్య మరొకటి నేర్పి దానిని అర్జునునికి నేర్పనని నాకు మాట ఇవ్వండి’ ద్రోణాచార్యుల వారు అశ్వత్థామకు చీకటిలో బాణాలు వేసే విద్య నేర్పాడు. దాన్ని శబ్దగ్రహణ విద్య అంటారు. ద్రోణుడు ఈ విద్యనేర్పుతూ తనలో తాను నవ్వుకున్నాడు. ఒకరోజు రాత్రి భోజనం చేస్తూన్నపుడు దీపాలు ఆరిపోయాయి. అర్జునుడు తన ఆహారాన్ని ఆ చీకటిలోనే తినేసాడు. అపుడే అర్జునుడికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఆ రాత్రిపూటనే బాణం వదిలాడు. ఆ బాణం వెళ్లిన శబ్దం వింటూ మరో బాణం దానికి తగిలేట్టుగా వదిలాడు. అలా బాణం తరువాత బాణంవేస్తూ ఒక బాణపు రజ్జును తయారు చేసి ఆ శబ్దగ్రహణ విద్యను తనకు తానే నేర్చుకోగలిగాడు అర్జునుడు. ఎలా ఇది సాధ్యమైంది ఆ ఏకాగ్రత! ధ్యానంవల్ల! ధ్యానమొక్కటే రాజమార్గం- ధ్యానమొక్కటే రాజయోగం! ధ్యానం చేసేవారే దేవతలు! అరగంట ధ్యానం అరచేతిలో వైకుంఠం! ధ్యానమంటే కాఫీ త్రాగినంత సులభం! అర్జునుడు తెల్లవార్లూ ధ్యానయోగ సాధన మరియు అస్త్ర శాస్త్ర సాధన చేసేవాడు అని చెప్పుకున్నాం కదా! ఎంత శ్రద్ధగా ధ్యానం చేశాడో అంత శ్రద్ధగా విలువిద్యా సాధన చేశాడు కనుకనే శబ్దగ్రహణ విద్యను స్వయంగా సాధించాడు అర్జునుడు.
‘శ్రద్ధా - సబూరి’ అని ఎప్పుడూ బోధించేవారు షిర్డీ సాయిబాబా ‘శ్రద్ధ-సహనం’ అని. సాధన ఎంతో శ్రద్ధగా చేయాలి. అది ధ్యాన సాధన అయినా- విలువిద్యా సాధన అయినా! మధ్యలో ఎన్నో అవాంతరాలు వస్తూనే వుంటాయి. సహనంలో వాటిని సాధకుడు భరించాలి! సాధనమున సమకూరు పనులు ధరణిలోన! సాధన చేయమురా నరుడా సాధ్యము కానిది లేదురా అన్నారు తుకారాం.
స్వాధిష్ఠాన లక్షణమన నేయి- మణిపూరకమైన అగ్నిలో దగ్ధమై ‘విభూది’గా మారుతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని శ్రీకృష్ణులవారు చెప్పినదాన్ని గురించి అర్జునుని ఆత్మశక్తి గురించి రేపు చెప్పుకుందాం! ఇది మణిపూరక శక్తి!
-మారం శివప్రసాద్
9618306173, 8309912908

స్వాధ్యాయ సందోహం--6

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు

ఆకలిని తొలగించుకొనేందుకు ఎలా ఆలోచించి ప్రయత్నిస్తామో అదే రీతిగా ఆత్మను గురించి చింతన చేస్తూ దానిని దర్శించేందుకు ప్రయత్నించాలి. నిజమైన ఆత్మప్రేమికుడు ఏ ఒక్కరినీ తక్కువగా చూడడు. ఎవరియందును - వేనియందును తుచ్ఛమైన ఉచ్ఛ- నీచ భావాలను కలిగియుండడు. తన దుఃఖాలను నివారించుకొనేందుకు ఎలా ప్రయత్నిస్తాడో అలాగే ఇతరుల దుఃఖాలను- కష్టాలను పురుషార్థబుద్ధితో తొలగించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అట్టి జ్ఞానియే వాస్తవంగా ‘ఆత్మ ప్రేమి’ అని శ్లాఘింపబడేందుకు అర్హుడై యుంటాడు.
ఆత్మదర్శనం ఈశ్వరానుగ్రహమే
న వి జానామి యది వేదమస్మి నిణ్యః సన్నద్ధో మనసా చరామి
యదా మాగన్ ప్రథమజా ఋతస్యాదిద్వాచో అశ్నువే భాగమస్యాః
భావం:ఈ శరీరంగా ఏది ఉందో అదే నేనుగా అనుకొంటున్నాను. కాని స్పష్టంగా నేనెవరో నాకు తెలియదు. నాలోని మనస్సు చేత బంధింపబడి అది ఎటు నడిపితే అటే మూఢునివలె సంచరిస్తున్నాను. సత్యజ్ఞానస్వరూపుడైన జగత్ప్రభువు దర్శన మెపుడవుతుందో అప్పుడే నేనెవరో అన్న సత్యజ్ఞనం నాకు కలుగుతుంది.
వివరణ: కఠోపనిషత్తులో ఇలా వ్రాయబడి ఉంది.
నైవ వాచా న మనసా ప్రాప్తుం శక్యో న చక్షుషా
అస్తీతి బ్రువతో - నృత్య కథం తదుపలభ్యతే
ఆత్మప్రబోధ వాక్యాల చేత తెలియబడదు. మనస్సు చేస ఊహలచేత గ్రహింపబడదు. మాంస నేత్రాలకు దర్శనం కాదు. అంటే- జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు తమ సామర్థ్యం చేత ఆత్మజ్ఞానాన్ని కలిగింపలేవని భావం. ఇక మనస్సంటే ఈ జ్ఞాన కర్మేంద్రియాల వలన కలిగే జ్ఞానాన్ని మాత్రమే సమీకరించి తెలుపగలదు. మరి అట్టి మనస్సు ఆత్మజ్ఞానాన్ని ఎలా తెలుపగలదు? ఎవరికి ఆత్మజ్ఞానం కలుగుతుందో వారి నుండి మాఅతమే ఆత్మజ్ఞానం పొందగలం గాని ఇతరులనుండి పొందలేము- అని కఠోపనిషత్తు వివరిస్తూంది.
‘న మనసా ప్రాప్తుం శక్యః’- మనస్సు చేత ఆత్మదర్శనం కాదన్న ఉపనిషత్ భావానే్న వేదమంన్రిథ్యః మనసా సన్నద్ధః. మూఢునివలె మనుస్సనకు లొంగి తిరుగుతున్నాను. అట్లు తిరిగే నేను ‘నేనేమిటఇ? నే నెవరు? నా స్వరూప స్వభావాలేమిటి?’ అనే విషయాలను ‘న విజానామి’ తెలుకోలేకున్నాను అని వివరించింది.
అనుమాన ప్రమాణం చేత ఏదైనా తెలియబడితే అది కేవలం సామాన్యజ్ఞానమే అవుతుంది. ఉదాహరణకు పొగను చూచిన వెంటనే అక్కడ అగ్ని ఉందని తెలియబడుతుంది. కాని ఆ అగ్ని గడ్డిదా? ఆవు పిడకలదా? కట్టెలదా? అన్న స్పష్టమైన జ్ఞానం కలగదు. అలా కలగాలంటే ప్రత్యక్ష ప్రమాణం చేత మాత్రమే కలుగుతుంది. అదేవిధంగా అజ్ఞానులను (మృతశీరులను) జ్ఞానులను (అమృత శరీరులను) చూచి ఎవరు ఎట్టివారోవ వారిలో నేనెవడను కాగలనో తెలుసుకోలేను. ‘యదివేదమస్మి’ అలా కాక నేను తెలుసుకొన్నానని అహంరించితే ‘సు వేదేతి’ ఆత్మ సాక్షాత్కారి అయిన వేదర్షి ‘దభ్రమే వాపి నూనం త్వం వేత్థ’ (కేనోపనిషత్తు) నిజంగా నీకు ఏమీ తెలియలేదని మందలించాడు. అందుకే ప్రస్తుత మంత్రం ‘నవిజానామి’=సంపూర్ణంగా నాకేమీ తెలియదు అని పేర్కొంది. అయితే నాపై పరమేశ్వరుని దయ ఉంటే ఈశ్వర సాక్షాత్కారం నాకు కలిగితే ఈ మృతప్రాయమైన శరీరంలో ఉండి నిరంతరం నేను నేను అని పలికే ఆత్మను తెలుసుకోగలను అని ‘యదా.. భాగమస్యాః’ అని నిస్సంశయంగా పేర్కొంది.

..........................ఇంకావుంది

-- టంగుటూరి మహాలక్ష్మి