సుమధుర రామాయణం

సుమధుర రామాయణం -- సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

684. అనుచు దెల్పి హనుమ మనసార రాముని
దలచుకొని యరిష్ట పర్వతమును
ఎక్కి మేనుపెంచి కుప్పించి యెగయగ
పర్వతమ్ము క్రుంగె పుడమిలోకి

685. ఆకసంబున నెగిరెడు రెక్కలుగల
పర్వతమువలె హనుమంతుడరుగ దొడగ
మార్గ మధ్యములోన మైనాక గిరిని
బలుకరించి, గాంచె మహేంద్ర పర్వతమును

686. సింహనాదము జేసె కేసురి సుతుండు
అదియు విని జాంబవంతుడు కవులతోడ
కార్య సాఫల్యతను బొంది కరువలి సుతు
డొచ్చుచున్న వాడిది వాని గర్జనంబె

687. జాంబవంతు మాటలను విని వానరు
లపరిమితముదమ్ముతోడ హనుమ
రాక కొరకు కొండ శిఖరాలకును బ్రాకి
జూచుచుండి రెంతొ కౌతుకమున

688. అంతలో మహాధ్వనితోడ గాలి వీచె
పర్వతాకృతి తోడ ప్రభంజనాత్మ
జుండు కాలు మోపెను మహేంద్రాచలమున
గాంచి కపులు హర్షాతిరేకమ్ము తోడ

689. చుట్టు నుంజేరి ప్రీతితొ జూచువారు
మధుర ఫలముల కానుకలిచ్చు వారు
తోకలాడించి కిలకిలలాడువారు
చెట్టుకొమ్మలపై నెక్కి నూగువారు

690. దేహమున నొక్క గాయపు చిహ్నమైన
లేక యింతటి సాహస కార్యమొక్క
రుండు నెరవేర్చె విజయవంతముగ ననుచు
వాయునందను బొగడిరి ప్లవగ పతులు

691. అంత హనుమంతు డందగ జాంబవంతు
లాది కపివరుల కభివాదము లొనర్చి
జూచినాడను లంకలో జనకుసతను
క్రూర రాక్షస వనితల వలయమందు

692. మూడు లోకములను తపశ్శక్తి తోడ
నుద్దరించగల మహిమోపేత సీత!
రామ రవిజుల యత్న సాఫల్యమునకు
నామె కారణమని మ్రొక్కె నిలజ కపుడు

693. అమృత ధారలై చెవులకు సోకినట్టి
హనుమ మాటల కలరి హరీశు లంత
నీపరాక్రమమున మాకు ప్రాణదాత
వైతివని ప్రేమతో నిమిరిరి హరీశు

694. జాంబవంతుడు హనుమ నీవిచటి నుండి
యరిగినది మొదలా విషయమ్ములన్ని
విన కుతూహలముగ నున్న దనగ పూస
గ్రుచ్చినట్లు జెప్పె తన ప్రయాణ కథను

695. అంగదుండు మనమె దశకంఠు బరిమార్చి
ధరజతోడ రామచంద్రు కడకు
బోదమన్నజాంబవంతుడు మనకట్లు
లేదు వానరేంద్రు నాజ్ఞ యనుచు

696. సీత నరయుట యే సూర్యజుండు మనకు
నిచ్చినట్టి యాదేశము నదియుగాక
రామచంద్రుడు సర్వరాక్షసులతోడ
రావణు బరిమార్తునని ప్రతిజ్ఞ జేసె

697. మానధనుడైన దశరధనందనుండు
వప్పు కొనడు ప్రతిష్టకు భంగమైన
సూర్యనందనుడును రామకార్యమునకు
తోడు పడుదు నేనని బాసజేసినాడు

698. గాన మనుమ కిష్కింధకునేగి విషయ
ములను నృపులకు వివరింప వలయునన్న
జాంబవంతుని ఉచితవౌ భాషణములు
విని పయనమైరి కపులు ప్రసవణ గిరికి

699. దధిముఖుండను వానరోత్తముడు గలడు
మేనమామ సుగ్రీవున కతని పాలి
తమ్ము మధువనమందున దిగిరి కవులు
మధువునుంద్రావు కోరిక తోడవారు

టంగుటూరి మహాలక్ష్మి