సుమధుర రామాయణం

సుమధుర రామాయణం -- సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

716. పవన నందను డంజలి బద్దడౌచు
రామచంద్రుని ముందర నిల్చి దేవ!
కంటి మాతను సీతను లంకలో
వికృత రాక్షస వనితల వలయమందు

717. రామచంద్రుని చూపులు పవన సుతుని
ముంచె నానంద సాగరమందు లవణ
సాగరము దాటె గోష్పాదముగను గాని
రాము నానంద వీక్షణ లభ్యమైన
సమ్మదాబ్దిని గడవగ జాలడయ్యె

718. ‘‘ఆంజనేయ! నా జానకి క్షేమ వార్త
నాకు వినిపించి యింత యానందముగలు
గంగ జేసితి వే మివ్వ గలనటంచు
గాఢముగ కౌగిటం జేర్చుకొని విభుడు

719. ‘‘ఎట్టులున్నది నా సీత! యేమి బల్కె?
పవనజా! దెల్పు’’ మన భక్తితోడ హనమ
దక్షిణ దిశకు దిరిగి మాతకును మ్రొక్కి
‘‘క్షేమమే స్వామి! భూపుత్రి యగ్ని తుల్య

720. మనసు మీ యందె లగ్నమొనర్చి మిమ్ము
జేరుకొను నాశ జీవించి యున్నదయ్య
రాక్షస స్ర్తిలు బెట్టెడు రాపితులకు
నోర్వలేక ప్రాణత్యాగమునకు బూన

721. పాడినాడను రఘు వంశ ప్రాభవమును
మెల్లగానామెయే వినగల్గు నట్లు
నన్నుమీ దూతయని తల్లి నమ్ముటకును
మీ చరిత్రము విని హర్ష చిత్తచ

722. నన్ను విశ్వసించి నాతోడ మాటాడె
సూర్యజునకు మీకు మైత్రి గల్గె
ననుచు విషయములను వివరింప సంతోష
భరితయయ్యె మాత భవ్యచరిత

723. మెల్లగా నేను సూక్ష్మవౌ మేనితోడ
మాత చెంతకుజని యంగుళీయకమ్ము
నందజేసితి మిమ్ము గన్నటుల జనని
నశ్రులొలికెడు కన్నుల కద్దుకొనియె

724. అంత వాత్సల్యముగ నన్ను జూచి మాత
‘‘హనుమ! రావణుడిచ్చిన గడువు రెండు
నెలలు పిదప నన్నుచిఅత హింసలకు గురిగ
జేతు రీలోపె శత్రువధ జరుగవలయు

7725. సూర్యనందను డొచ్చునా సాయముగను
భరతు డంపునా చతురంగ బలము నిటకు
సాగరము దాట శక్యమా సైన్యమునకు
రావణుడు హతమారునా రాము చేత?’’

726.అనిన తల్లికి ధైర్యము జెప్పి నేను
‘‘చింత వలదమ్మ నీకింక శక్రసములు
దాశరధులకు నీ జాడ దెలిసి నంత
వానరాధిపులను గూడి వత్తురిటకు

727. రాక్షసానీకమును తమ బాణ వహ్ని
భస్మమొనరించి రావణు పుత్ర మిత్ర
బంధు కోటితో బరిమార్చిపద్మనయన!
ప్రీతి కొంపోవుదురు మిమ్మయోధ్యకంటి

728. నన్ను మించిన వీరులు నాతో సములు
గలరు లెక్కకు మించిన కీశపతులు
రవిజు కనుసన్న లంకకు వచ్చి సర్వ
రాక్షసుల నంత మొందింతు రమ్మయంటి

729. తల్లి సెలవిమ్ము నేబోయి వత్తుస్వామి
కానవాలుగ నేమైన నొసగు మనగ
చిత్రకూటాద్రి యందు నీ యెదుట జరిగి
నట్టివాయస కథనము జెప్పి నాకు

730.ఇమ్మహామణి నొసగె శ్రీరామచంద్ర!
దీని బరికింపు మని స్వామి హస్త పద్మ
మందు మణినుంచ రాఘవుండార్తి తోడ
మణిని జూచుచు నక్కున జేర్చుకొనియె

731. లక్ష్మణ సుగ్రీవుల దెసకు జూచి రాము
డాత్మ బంధువులార! జానకి శిరోజ
ములను శోభించు రుూదివ్యమణిని జూచి
యెదుట నామెనె గనుకొని నట్టులయ్యె

-- టంగుటూరి మహాలక్ష్మి