సుమధుర రామాయణం

సుమధుర రామాయణం.. (సుందరకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

605.ముద్రికను జూచి ప్రేమ ముప్పిరి గొనంగ
నశ్రవులు నిండియున్న నేత్రముల కద్దు
కుని శుభశకునంబుల ఫలం అని జనకజ
ఆంజనేయుని కొనియాడె నాదరమున

606.‘‘నాదు ప్రాణదాతవు పవనసుత నీవు
సాగరముదాటి లంక శోధించి నన్ను
గాంచి రామ సందేశము దెల్పినాడ
వన్న నీవు కేవల కపివే గణింప

607.బుద్ధిశాలివి రామభక్తుడవు నీదు
శక్తి దెలియు ధీశక్తి దాశరధికెగల
దిచట నాస్థితి యినవంజజులకు దెల్పి
శీఘ్రమే జనదేర బల్కుము కపీంద్ర!’’

608.‘‘తల్లి! ఈ వియోగము మీకికేలనమ్మ
నాదు భుజసీమపైనిను రామచంఅదు
కడకు గొంపోదు నగ్నిహోత్రుండు హోమ
ద్రవ్యముల నింద్రు కడకు గొంపోవునట్లు

609. అట్లు బల్క హనుమ జనకజవాత్సల్య
పూర్ణ హృదయ చ పవనజునితో
‘ఆంజనేయ!’ నీ కపి స్వభావంబున
నట్లు బల్కినాడ వంతెగాని
యింత సూక్ష్మరూపివై యున్న నీవెట్లు
జేర్చగలవు నన్ను రాము కడకు

610. ఆ పరాభవ దుఃఖము నణచుకొనుచు
పెరిగె హనుమ మహోన్నత మేరు గిరి
సమానముగ వజ్ర తుల్యములైన దంష్ట్ర
లున్న ఖంబులు మండెడు నగ్ని వంటి
ముఖము శత్రు సంహారక మూర్తి దాల్చి

611.సీత యెదుట నిల్చి జనని నీకిప్పుడు
నమ్మకమ్ము గల్గెనని దలంతు
సర్వ రాక్షసాళితో లంకను పెకల్చి
స్వామి ముందు నుంచగలనటంచు

612.అగ్నిగోళములవలె వెలుంగు నేత్ర
ములతో భీమరూపమ్మున ప్రభలు జిమ్ము
కపికులాగ్రణిం గాంచి భూతనయ హర్ష
సంభ్రమంబుల హనుమ శాంతింపు మనుచు

613.వానరాగ్రణి యసమానసత్వుడవని
నే నెరుంగుదునయ్య దేవేంద్ర సములు
దాశరధులకు యిది కీర్తి కరముగాదు
మిత్రులతో వారి దోడ్కొని రమ్ము యిటకు

614.విష్ణు సమపరాక్రమ శౌర్య వర్ధనులగు
రామ సౌమిత్రు లేతెంచి పుత్ర మిత్ర
బంధు సేనలతో రావణు బరి మార్చి
నన్నయోధ్యకు గొంపోవ సంతసింతు’’

615. జనని! జూడు మింక జాంబవ దంగద
వానరేశ సర్వ వానరులతో
దాశరథులు వచ్చి దశకంఠు బరిమార్చి
సర్వ రాక్షసులను సంహరింత్రు

616. మాత! సెవిమ్ము నే బోయి వత్తువేగ
నానవాలుగ స్వామికేమైన నొసగు’
మన తన వివాహవేళ కానుకగ తండ్రి
యిచ్చినట్టి చూడామణిన్ హనుమకిచ్చి

617.దీని జూచిన తోడనె దాశరథికి
తల్లిదండ్రులు జనక భూవల్లభుండు
నేను గుర్తుకొత్తుము వేరె కధయు గలదు
యితురలెవ్వ రెరుగంగరు దీని ననుచు

618.హనుమ మేమొకపరి చిత్రకొటమందు
వన విహారము సల్పి వృక్షంపు ఛాయ
విశ్రమించితి మపుడొక వాయసమ్ము
నన్ను బాధింప కోపించి రాఘవుండు

619.విసరె దర్భను బ్రహ్మాస్తమ్రుగ నొనర్చి
కావుకాండని త్రిలోకములు కాకి
దిరిగి దిక్కెవ్వరును లేక దాశరధినె
శరణు వేడ కన్నొకటి హరించి విడిచె
*

- టంగుటూరి మహాలక్ష్మి