సుమధుర రామాయణం

సుమధుర రామాయణం.. (సుందరకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

700. కొమరు నంగదు ననుమతి గోరుకొనిరి
హనుమజాంబవదాదు లంగీకరింప
ననుమతించెను వాలినందనుడు నంత
మధువనంబున జొచ్చిరీ మధువు గ్రోల

701. వనమునం బ్రవేశించి ప్లవంగ పతులు
మధుర ఫలముల భుజియించి మధువుగ్రోలి
మతుతలై యాట పాటల మతులు మరచి
మధువనము నంత గలచగ దధిముఖుండు

702. జూచి వారింపబోవగ సహచరులతో
నాతనింబట్టి కరచియు మోది రక్కి
బహువిధంబుల బాధించిరపుడుహనుమ
మీరు సేవింపుడీకోరి నంత మధువు

703. అనుచుబల్క హనుమ వనచర వర్యులు
హద్దు మీరి చెట్ల కొమ్మలని
విరిచిరి బహుకాల సంచితమై యున్న
మధువు పాత్రలందుకొనుచు ద్రావి

704.ప్రక్కవారికి ద్రావించి పార బోసి
గీరుకొనుచును నవ్వుచు క్రింద బడుచు
కిలకిలారావముల తోడగంతులిడుచు
ఎగురుచును నూగుచు వనము జెరచు చుండ

705. పరుగు పరుగున దధిముఖుండరిగి వాన
రాధిపతి పదముల వ్రాలి దేవ యంగ
దాదు లింతకు మునె్నవ్వరుదరి జేర
లేని మధు వనమంతను జెరచుచుండ

706. మేము వారించ బోవగ మమ్ము పాద
తాడనమ్ముల ముష్టిఘాతముల బొడిచి
రంచు మొరపెట్టు, రవిసుడు డంగదాదు
లవనిజను జూచి వచ్చినారని గ్రహించె

707. హనుమ సాధించియుండు నిక్కర్కమంచు
జెప్పు సూర్యజు మాటలు శ్రవణ సుఖము
గల్గజేయ సంతుష్టాంతరంగు లౌచు
జూచుచుండిరి రఘువంశ జాతులప్పుడు

708. కమలదళ నయనుల యినకుల తిలకుల
సకల సుగుణాభి రాముల కార్యసిద్ధి
గల్గినందుకు ధన్యత గల్గెనంచు
మేను పులకింప నుప్పొంగెనిన సుతుండు

709. రవిజుడంతట దధిముఖా! హనుమ యంగ
దాది కపివరేణ్యులునుత్సాహమ్ము తోడ
వనవిహారము సల్పిరి యని దలంతు
కార్యసాధకులు విజయ గర్వమునను

710. శ్రీఘ్రముగ మధువనమున కేగి నీవు
జనక పుత్రిక నరయు ప్రయత్నమంత
భానుకుల దీపకుల చెంత వినగ మేము
వేగిర పడుచుంటిమని వారలతొ ననుము

711. రఘుకులోద్ధారకులకు కిష్కింధ పతికి
అంజలి ఘటించి దధిముఖు డెగె శీఘ్ర
గతిని మధువనమున కంగదాది కీశ
వల్లభుల ముందు వినయుడై తలను వంచి

712. మాననీయులార! మన్నింపుడీ నన్ను
తప్పు జేసినాడ తమరుజేసి
నట్టి పనికి సూర్యనందనుం డలుగక
మిమ్ము వేయమె జనుదేర బల్కె

713. అంగదుడు విని మనరాక రాఘవులకు
దెలిసె మనమిందు దడయరాదనగ కపివ
రేణ్యులంత సమ్మదమున పయనమైరి
రామ రవిసుతులున్న ప్రస్రవణ గిరికి

714. హనుమ ముందు జనగ నాకాశ మార్గాన
వాయు చలిత మేఘ మండలి వలె
గర్జనములతోడ వచ్చెడు కపి సేన
కలకలమ్ము విని సుగ్రీవుడంత

715. ‘‘రామచంద్ర! వారు జానకీ దేవిని
నిశ్చయముగ జూచి వచ్చుచున్న
వార’’లంచు బల్కు సుగ్రీవు మాటలు
ముగియు నంతలోన దిగిరి కవులు

టంగుటూరి మహాలక్ష్మి