సుమధుర రామాయణం

సుమధుర రామాయణం.. (యుద్ధకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1046. తమ్ముడా! రావణుడు యుద్ధ విద్యయందు
నతి సమర్థుడు వానితో నతి సమర్థ
వంతముగ పోరవలె నప్రమత్తుడవయి
యనుచు బోధించి బంపె యాశీర్వదించి

1047. అంతలో హనుమంతుడు రావణునకు
యెదురుజని రావణా! నీవు దేవ యసుర
యక్షరాక్షస గంధర్వగణముచేత
వధ్యుడవుగావు వీరు వానరులు నరులు

1048. వీరిచే నంతిమ శ్వాసవిడుతు వీవు
పంచశాఖల వృక్షము బోలియున్న
ఈమదీయ హస్తము దీని చాలనమున
ప్రాణరహితుజేయుదుననె పవనజుండు

1049. విన్న రావణు కనులెఱ్ఱనయ్యె క్రోధ
దృక్కులతో పవమాన నందనుని జూచి
వానరా! జూపు నీ బలవీరములను
పిదపదీయుదు నీ పంచప్రాణములను

1050. రావణా! మరచితివ నీ యనుగుపుత్రుడు
యక్షుగూల్చినదీ ముష్టిఘాత మనగ
మండిపడి రావణుడు హనుమంతునొక్క
పోటుపొడువగ కంపించె పవనసుతుడు

1051. క్షణకాలమ్ములో తేరుకొనియె హనుమ
వజ్రతుల్యవౌ పిడికిట వైరినొక్క
పోటు పొడువ వివశుడౌచు పడియె రావ
ణుండు మడిసె నీతడని దలంప కవులు

1052. తెప్పరిలి రావణుడు హనుమంతు మెచ్చు
కొనుచు మారుతీ! నీ పరాక్రమము జూచి
సంతసించితి’’నన్న ఛీ! నీవు జీవ
ములతొ నుంటివి యిది పరాక్రమమె దలప’’

1053. అంత రావణు డసమాన బలముతోడ
హనుమ వక్షము ప్రహరించ పవనజుండు
మూర్చి తుండయ్యె రధమును నచటి నుండి
కపుల సేనాని నీలుని కెదురు నడిపి

1054. క్రూర సర్పములనుబోలు కరకుబాణ
ములను నీలుని గప్పగ బాణములను
దప్పుకొని నీలుడు తన విచిత్ర విద్య
తోడ నల్పశరీరుడై తన విచిత్ర విద్య

1055. చిత్ర విన్యాసముల రాక్షసేశ్వరు రధ
కేతన కిరీట ధనువులపై నెగురుచు
రావణు చికాకు పరచు సేనాని నీలు
జూచి రామసౌమిత్రులు మెచ్చుకొనిరి

1056. అల్పదేహంబుతో నెగురుచు శరముల
కందకుండ సంకటము గల్గించు నీలు
రావణుండు కోపాగ్నితో రగిలె యతని
పై ప్రయోగించె నాగ్నేయ యస్తమ్రపుడు

1057. మూర్ఛితుండయ్యె కీశసేనాధిపుండు
వానరకులములో దేవకార్యమునకు
బుట్టె తనయంశ నీలుడుగాన నతని
యగ్ని గాపాడె వివశుడై యుండు నటుల

1058. నీలు డవని వ్రాలుట జూచి లక్ష్మణుండు
రౌద్రమున ధనుష్టంకారమున్నొ నర్చి
రావణా! యెంత తడవు వానరులతోడ
పోరానర్తువు నాతోడపోరు మింక
1059. రమ్ము లక్ష్మణ యింతకాలమ్ము కిపుడు
నాయదృష్టము ఫలియించె నిన్ను జేర్తు
యముని కడకన్న నవ్వి రామానుజుండు
రావణా! వీరుడెవ్వడు ప్రేలడిట్లు

1060. రావణుడు క్రుద్ధుడై యేడు బాణములను
లక్ష్మణునిపై ప్రయోగించ దారిలోనె
వాని ఖండించి వజ్రసదృశ శరములు
విడువ మూర్ఛితుండయ్యె లంకాధిపుండు

1061. తేరుకొనిలేచి యసురేశ్వరుండు తనయ
మోఘ శరములు వవ్మౌట గాంచి లక్ష్మ
ణు రణపటిమ కాశ్చర్యరోషముల విషపు
శరములం గప్పివైచె సుమిత్ర సుతుని

1062. వచ్చిపడు బాణములద్రుంచివైచి ఇంద్రు
చాప సమబాణముల నిశిచరుని ధనువు
విరిచి నొప్పించె శరపరంపరల బరపి
లక్ష్మణుడు జూపె తన పరాక్రమమునపుడు

1063. రక్తసిక్త శరీరుడై రావణుండు
యుద్ధముల శక్తిసామర్థ్యమున్న యోధు
డజుని దత్త మహోగ్ర శక్త్యాయుధమ్ము
విసర నదియగ్నిశిఖల లక్ష్మణుని దాకె

1064. మూర్ఛనొరిగెను లక్ష్మణమూర్తి యపుడు
రావణుడు లక్ష్మను నపహరించు యత్న
మున కరమ్ముల నెత్తుచునుండ హనుమ
రెప్పపాటున రావణు చెంతవ్రాలి

1065. రెండు చేతులు బిగియించి రాక్షస విభు
వక్షమున ప్రహరింపగ ముఖమునుండి
రక్తముంగార రధముపై గూలబడియె
కపులు మరణించె రావణుండని దలంప

టంగుటూరి మహాలక్ష్మి