సుమధుర రామాయణం

సుమధుర రామాయణం.. (యుద్ధకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1186. వారుణాస్తమ్రుతో దాని వెనుక కంపి
ఐంద్రనామకాస్తమ్మ్రును ధనువు నందు
గూర్చి రాముడు ధర్మ విగ్రహుడు సత్య
సంధుడైన రుూ యస్తమ్రు నితనిగూల్చు

1187. ననుచు విడిచె యస్తమ్రును రామానుజుండు
తీవ్రవేగముతోనది వజ్రమకుట
కుండ లాలంకృతమ్మగు మేఘనాధు
శిరము ఖండించి భూమిపై జేర్చెనంత

1188. సురలు గురిసిరి విరివాన సురవిరోధి
భయముతీరెనం చాడిరచ్చరలు మింట
అతనికాంతలు యంతపురమ్ములందు
తలలు మోదుక బిట్టు శోకించి రపుడు

1189. మర్కటేంద్రులు జయము జయమ్మటంచు
విజయ శబ్దంబులను లక్ష్మణుం బొగడిరి
చెదిరి పారిరి రాక్షస సేనలెల్ల
రామపాదములకు మ్రొక్కె లక్ష్మణుండు

1190. యుద్ధ విషయములన్నియు శ్రద్ధతోడ
భానుకుల దీపకునకు విభీషణుండు
దెల్పరాముడు తమ్ముని ప్రేమమీర
దరికి దీసుక కౌగిట జేర్చుకొనియె

1191. సుతుని మరణము రావణాసురుని తీవ్ర
వేదనకు గురిచేసి నేత్రముల నుండి
నశ్రుధారలు స్రవియించె నవయవములు
వశముదప్పెను ముఖము వివరణమయ్యె

1192. ‘‘నాయనా! ఇంద్ర యను వరుణాది దేవ
తలను కంపింపజేసిన ధీర! నీవు
కదనమున నొక్కనరునిచే గూలినావె’’
యనుచు విలపించె తనయుని దలచుకొనుచు

1193. కొంత తడవుకు శోకము తగ్గి క్రోధ
మపరిమితముగ చెలరేగి ఇంద్రజిత్తు
మాయసీతను ఖండించె యేను నిపుడు
జంపెద నిజ సీతనని వనంబు కేగ

1194. భీకరమ్ముగ చేత ఖడ్గమ్ముబూని
వచ్చు రావణు నాప్తుడౌ సచివు డాపి
తగదు నీయంత వానికి స్ర్తిని జంప
ననుచు వారింప జనె వెనుకకును మరలి

1195. కొలువు కూటంబునకు నేగి కుపిత పన్న
గమువలె బుసగొట్టుచు దశగ్రీవుడపుడు
సేననాయకులార! రుూ దినమె రామ
లక్ష్మణుల సంహరించగవలయు ననియె

1196. రధబలంబులు పదివేలు నశ్వదళము
పదియు నాలుగువేలు వేదండబలము
పదియునేనిమిది వేలు కాల్బలము రెండు
లక్షల తొబలసి యసురబలము గదలె

1197. భేరి భాంకారములు గజ ఘీంకృతులను
భూరి రధనేమిరవములు హరులహేష
రావములు యసురుల సింహనాదములను
దిశలు మార్మ్రోగ రాక్షస సేన గదలె

1198. పోరు మొదలయ్యె నిరుపక్షములకు వారి
పాద ఘట్టనలకు రేగుధూలి రక్త
ధారలను నణగారె రాక్షసుల బాణ
వృష్టి కపులు విసురు వృక్షగిరులనణగె

1199. రావణు నపరిమిత మూలబల విజృంభ
ణమ్మునకు వానరులు చెదరి రఘువరుని
వెనుక కరుగ రాముడు చాపమును ధరింప
యసుర సేనాబ్ధికది యడ్డుకట్టయయ్యె

1200. రామకోదండ నిర్ముక్త బాణచయము
యసుర సేనను విరిగిన స్యందనములు
తొండములు తెగినట్టి వేదండములను
కాళ్ళుపడిన యశ్వముల ప్రోవులుగ జేసె

1201. కౌసలేయుని చూపులు కోటి సూర్య
ప్రభకు సమమై ప్రకాశించె రామచంద్రు
డసుర సేనపై గంధర్వనామకాస్త్ర
మున్ ప్రయోగించె నా యస్త్ర మహిమచేత

1202. రాక్షసుల కెదురుగ నున్నవాడు రామ
చంద్రువలెను గన్పింపగ తమలొతామె
పోరుసల్పుచు వారిని వారె జంపు
కొనిరి యాశ్చర్యచకితులైగనక సురలు

1203. మూల బలమట్లు నాశనమైన వార్త
దెలిసి రాక్షస స్ర్తిలు భర్తలను సుతులు
బంధువుల దలచుకొని రోదించిరీ య
నర్థమునకు కారణము శూర్పణఖె యనుచు

1204. స్ర్తి రోదన ధ్వనులు వీనులకు సోక
రావణుడెదుట నున్న మహోదరాది
యసురవీరులతో చతురంగ బలమునెల్ల
నాయతమ్మును జేయుడు ననికినేగ

1205. యనుచు కాలాగ్ని రూపుడై యసురవిభుడు
రాము నెదిరింప సంగ్రామభూమి కరిగె
క్రోధమే రూపుదాల్చిన విధము దోప
కాల చోదితుడై లోకనాధుపైకి

టంగుటూరి మహాలక్ష్మి