సుమధుర రామాయణం

సుమధుర రామాయణం.. (యుద్ధకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1346. వేకువనె విప్రశ్రేష్టుల వెంట గురుడు
వచ్చి జానకీ రాముల దివ్యమణుల
చే ప్రకాశించు పసిడి సింహాసనమున
గూర్చొనగబెట్టి వేదమంత్రములు జెలగ

1347. నదనదీ సాగర పవిత్రోదకము తోడ
మంత్రులెనమండుగురు రామచంద్ర విభుని
వసువులు సురపతి నభిషేకించునట్లు
మోదమున నిష్టగ నభిషేకమ్మొనర్చి

1348. వేదవేత్తలు వేదమంత్రములు జదువ
కమలభవు నిర్మితమ్మై మనువు ధరించి
నట్టి రత్న మకుటము వసిష్ఠ వౌని
సుజన పోషకురాముని శిరమునుంచె

1349. ఋత్విజులు రామభద్రున కితర రాజ
భూషణమ్ములతో నలంకృతుని జేసి
రంత బట్టె శత్రుఘు్నడు శే్వత ఛత్ర
మ సురహరి విభుల్ చామరలందు కొనిరి

1350. సాగె గంధర్వ గానము మ్రోగె దేవ
దుందుభులు నాట్యమాడి రప్సరగణమ్ము
పుష్ప వర్షము గురిసె నంబరమునుండి
రామచంద్రుడు కోసల ప్రభువుగాగ

1351. రాఘవేంద్రుడు గోవృషభాశ్వములను
రత్న మణిమయ స్వర్ణ్భూషణములెన్నొ భూసురోత్తములకు దానమొసగె వారు
తృప్తులై దాశరధిని యాశీర్వదింప

1352. సూర్య కిరణకాంతితొ ప్రకాశించు రత్న
హారమును సుగ్రీవునకు బహూకరించి
వజ్ర వైడూర్య ఖచితములు భుజకీర్తు
లంగదునకిచ్చె రఘువంశ మండనుండు

1353. చంద్రకాంతుల విలసిల్లు రత్నమాల
సీత గళమున రాము డలంకరింప
రాము వదనము సాభిప్రాయముగ ధరజ
జూడ రాముడు గ్రహియించె సీత మనసు

1354. ధరణిజా! నీకు నెవ్వరందరిలొ ప్రీతి
పాత్రుడో వానికీ హారమును బహూక
రింపుమని రాముడనగ హారమ్ము దీసి
ఆంజనేయునకిచ్చె భూజాత సీత

1355. కోటి భాస్కర తేజముతోడ హనుమ
వెల్గె మాత ప్రసాదించినట్టి రత్న
హారము గళమందు ధరించి హరివరేణ్యు
డంజలి ఘటించె జనకజా రాఘవులకు

1356. రామచంద్రుడు తనతో నయోధ్యకుత్స
వంబు జూడవచ్చిన హరివరుల నెల్ల
విలువగల వస్త్ర భూషణముల నొసంగి
సత్యరించె నుత్సవము సంపన్న మయ్యె

1357. ధర్మపరు విభీషణు సత్కరించె నెన్నొ
కానుకలనిచ్చి కౌసల్యనందనుండు
మిత్రులౌ సుగ్రీవ విభీషణులు రఘువరు
శలవుపొంది జనిరి తమ నెలవులకును

1358. జనుల కత్కంత ప్రేమా స్పదుండు రామ
భద్రుడు వహించె రాజ్యభారమ్ము పెద్ద
తమ్ము భరతుని యువరాజు నెమ్మిజేసె
ప్రజల క్షేమమె లక్ష్యమై రాజ్యమేలె

1359. దాశరధి పౌరుల సుఖశాంతులకువాజ
పేయ పౌండరీ కాశ్వమేధాది యాగ
ములను దేవతలకు తృప్తిగలుగజేసె
రామరాజ్య మాదర్శ ప్రాయమ్మునయ్యె

1360. కౌసలేయు రాజ్యమునందు మచ్చుకైన
గానరా రనాధలు సర్ప చోరభీతి
లేదెవరికి నకాలమృత్యువులు లేవు
ధర్మపరులును లోభవర్జితులె నంత

1361. సత్య వచనులు శమదమ సద్గుణులును
దీక్షితులు దేవతాతిధి పూజలందు
దానశీలురు శాస్త్ర చింతన పరాయ
ణులును నిత్యసంతుష్టులు నెల్లప్రజలు

1362. ధర్మసూత్రములెన్నో రామాయణమ్ము
దెలియ జేయును మానవులెట్లునడచు
కొనవలెనొ ఋషి వాల్మీకి కవివరుండు
దెల్పె మసళలు జదువ శ్రేయస్సుగల్గు

1363. ఈ మహా ఇతిహాసము భక్తిశ్రద్ధ
లను పఠించిన కీర్తి ప్రతిష్టలబ్బు
దీని జదివిన స్ర్తిలు సంతాన వతులు
నౌదు రమరు లీడేర్తు రభీష్టములను

1364. ఆదికావ్యము శ్రీమద్రామాయణమ్ము
గృహమునందున్న సకల శుభప్రదమ్ము
శ్రద్ధతో జదువ కుటుంబ వృద్ధికార్య
సిద్ధియును బుద్ధిబలము సిద్ధింపజేయు

1365. జలధిశయనుడు లక్ష్మీవల్లభుడు విష్ణు
దేవుడవతరించెనిలపై దుష్టశిక్ష
ధర్మ రక్షణ కొరకు శ్రీరాముడౌచు
జలధి సంభవ లక్ష్మీయే జనకతనయ

టంగుటూరి మహాలక్ష్మి