సుమధుర రామాయణం

సుమధుర రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

548. ప్రీతితో నిన్ను సేవించు నాతో సుఖము
పొందు మీ స్ర్తికి రుూ సుఖ సంపదలను
ననుభవించగ వ్రాయడు నజుడు రుూమె
నుదుట యని’’ మరల్చెను పత్ని ధాన్యమాలి

549. అట్టహాసము జేయుచు నచటనున్న
రాక్షస స్ర్తిల బిలిచి ‘‘మీరెట్టులైన
వశమునకు రెండు రుూమెను సమ్మతింప
కనున్న దండింపు’’డని జనె యానతిచ్చి

550. రావణుం డటుజనగనె క్రూరులైన
రాక్షసీగణ మవనిజన్జుట్టు ముట్టి
‘‘ఓ జనకసుత! మా ప్రభువునకు సాటి
ఎవ్వరీ మూడు లోకములందు చెపుమ

551. పద్మ సంభవు మానస పుత్రు లార్గు
రందు నాల్గవ వారు పులస్త్యు లతని
కరయ జన్మించి రుత్తముల్ విశ్రవసులు
ఆయనకు బుట్టిరీ దశాననులు సీత

552. మా ప్రభువు పేరు విన్నంత భాస్కరుండు
చల్లగా కాయు నెండను, గాలి మంద
మందముగ వీచు, తరువులు లతలు నిచ్చు
మధుర ఫల పుష్పములు యెల్ల ఋతువులందు

553. మూడుకోట్ల దేవతలు మా ప్రభువు నెదుట
తలలు వంచుక దాసులై నిలచి యుంద్రు
రాజ్యహీనుని శ్రీ శూన్యుడైన నరుని
మరచి రావణ ప్రభుతో సుఖింపు మింక’’

554. ఇవ్విధంబున రక్కసి వనిత లెల్ల
బోధ జేయగ రఘురాము పత్నివారి
వచనములు విని కనులు వర్షించు చుండ
‘‘వినుడు! నా భర్త రాము డెవ్వేళనైన

555. దినకరుని వీడి ఛాయయు దివిజపతిని
విడిచి శఉచియును, నలచక్రవర్తి వీడి

సుదతి దమయంతియును, సత్యవంతు వీడి
సాధ్వి సావిత్రి యుండని రీతి రామ
భద్రునిన్ వీడి జానకి బ్రతుక దెవుడు

556. భర్తయే నాకు దైవము గురుడు సఖుడు
నన్ను ఖండించినను మీ యధర్మ వచన
ములను విననన్న వికృతపు వదనములను
తమ కరాళపు జిస్వలు దెరచి వారు

557. మ్రింగెదమ్మంచు మీదికి రాగ సీత
భయమునన్వడంకుచు ‘హా రఘుకులసార్వ
భౌమ! రాఘవా! సౌమిత్రి!’ యని బిలచుచు
హనుమ దాగ్ను శింశుపతరువు జేరి

558. రెండు మాసములె గడు వాపైన నన్ను
జంపెదరు వీరు నా హృదయేశు రాము
గాంచు భాగ్యము గల్గునో గల్గదొ యని
నిలజ శోకించె రాక్షసీవలయ మందు

559. సుఖము దుఃఖము ప్రియము నప్రియములకును
లొంగి పోనట్టి చిత్తముగల్గు వారు
ధన్యులీదుఃఖమునకు నే తాళజాల’
ననుచు నోడ్చెడు సీత నదల్చుచున్న

560. యా నిశాచర స్ర్తిల నావలకు ద్రోసి
ఇంక నేమనవలదు జానకిని మీరు
యిపుడె నేనొక స్వప్నము గంటి ననుచు
త్రిజట వినిపించె తనుగన్న కలను నిట్లు

561. కమలలోచనుడౌ రఘురామమూర్తి
సీతలక్ష్మణసహితుడై పుష్పకమున
కోటిసూర్యుల కాంతితో శే్వత వస్త్ర
ధారియై యేగ గంటినుత్తరపు దిశకు
*

టంగుటూరి మహాలక్ష్మి