సుమధుర రామాయణం

సుమధుర రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

562. అంతలో శే్వత పర్వత శిఖరమందు
దంతిదంతనిర్మిత పల్లకీని భర్త
యంక పీఠిపై జనకజ యధివశించి
సూర్యచంద్రుల స్మృశియించు చుండ గంటి

563. అంత కలలోన నింకొక కలను గంటి
తైలదేహముతో మన దశవదనుడు
గార్థ్భములు లాగెడు రథమెక్కి పంక
కూపమందున బడుచుండ గాంచినాను

564. రాకుమారులు కుంభకర్ణాది సకల
రాక్షసులు మద్యమును ద్రావి రక్తవర్ణ
వస్తమ్రుల గట్టి గోమయకూపమందు
నాట్యమాడుచు నరచుచు పడుట గంటి

565. మన విభీషణప్రభు వాకసమ్ము నందు
నాల్గు దంతములున్న నాగమ్ము నెక్కి
వెల్ల గొడుగుల నీడ మంత్రులను గూడి
దుందుభులు మ్రోయ గూర్చుండియుండ గంటి

566. రమ్యమగు లంక నొక వానరుండు వచ్చి
దగ్ధ మొనరింప గాంచితి నిద్రలోన
రామ విజయము రావణు నాశమునకు
సూచన యిదియె’’ అని వివరించె త్రిజట

567. జానకిని భయ పెట్టుట మాని మీర
లీమెను శరణు వేడుడు ఈ జనకజ
బ్రోచు మనలను దయతోడనంచు బల్కు
త్రిజట మాటల విని భయభీతలైరి

568. అంత ధరణిజ నా ప్రాణనాధు బాసి
యిన్ని దినములు జీవించి యుంటి నన్న
నా హృదయ మెంత వజ్రతుల్యమ్మటంచు
తన్ను తాను నిందించుకో దొడగె సాధ్వి
569. అట్లు పుడమిజ మృగరాజు నెదుట పడ్డ
ఆడయేనుగువలె భయ శోకములను
మరణ మెవ్విధమున పొంద గలనటంచు
శింశుపావృక్ష శాఖను జేరి సీత!

570. దీర్ఘవౌ జడ నురిత్రాడుగా బిగించి
యాత్మహత్యకు బూనుకొన్నంతలోన
వామ నేత్రము వామ భుజమ్ములదరె
రామచంద్రుని జూచినట్లయ్యె నెదుట

571. మాసియున్న బంగారు వర్ణంపు చీర
చెరగు జారెను ఈ శుభ శకునములకు
తొలకరింపగ యెండు విత్తనము మొలక
యెత్తి నట్లుగా మనసుకు శక్తి వచ్చె

572. భాగ్యవంతుని జేరెడు భృత్యులవలె
జానకిని జేరె శుభశకునములు చంద్ర
బింబము గ్రహణ విముక్తమై ప్రకాశ
మొందినట్లు ప్రకాశించె మాత సీత

573. సర్వలోక శుభంకరి సూర్యవంశ
మండనంబు శ్రీరాముని ధర్మ పత్ని
పుట్టినది మొదలెట్టి కష్టమ్ము నెరుగ
నట్టి ఈ సాధ్వి దుఃఖమునన్ తపించె

574. ముందు ఈమెను ధైర్యము గల్గునట్లు
నేను మాటాడి పిదప రుూ నళిననేత్ర
జెప్పు సందేశమును రామచంద్ర విభున
కందజేయగ మిక్కిలి సంతసించు

575. రామ చింతనతో నున్న నీమెకు రఘు
నాధు గుణ కీర్తనము జేతునపుడు నన్ను
తప్పకను నమ్ము రాఘవు దూతనంచు
నని హనుమ మెల్లగా బల్కె నామె వినగ
*

టంగుటూరి మహాలక్ష్మి