సుమధుర రామాయణం

సుమధుర రామాయణం.. (సుందరకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

590. నాదు కోరిక దీర్పగ నాధు డరిగె
అంతలో రాము నెలుగున యార్తనాద
యపుడు వినవచ్చె లక్ష్మణు డరుగకున్న
నిష్ఠూరములాడి బంపితి సచ్చరిత్రు

591. ఆశ్రమంబున నొంటిగ నున్న నన్ను
సాధువేషంబునను వచ్చి మోసగించి
రావణాసురు డపహరించిటకు దెచ్చె
రెండు మాసము లేగ నే బ్రతుక హనుమ!’’

592. అట్లు బల్కుచున్న ఇక్ష్వాకు కులసతీ
మణికి ‘‘దుఃఖమింక వలదు తల్లి!
వేదవిదుడు రామచంద్రుని దూతగ
వచ్చినాడ నిన్ను గాంచినాడ!

593. కీర్తి కరమైన నీదు సందర్శనమ్ము
భాగ్య వశమున పొంద గల్గితిని తల్లి
రామ చంద్రులు కుశలురై యున్నవారు
లక్ష్మణులు మీకు భక్తితో మ్రొక్కె తల్లి’’

594. అనుచు మెల్లగ తనదరి కొచ్చు కపిని
రావణుండను శంకతోజూడ సీత
విశ్వసించుము తల్లి రావణుడగాను
రామ సందేశమును దెచ్చినట్టి కపిని

595. రామనామము విని హర్షహృదయ చ
కపికులోత్తమ రామలక్ష్మణుల రూపు
రేఖలెట్టివి వారి స్వభావ మేది
దెల్పు వివరముగ నన నుప్పొంగి హనుమ

596. ‘‘తల్లి నీవెరిగియు నన్ను దాశరధుల
గుణగణంబులు రూపురేఖలను దెల్పు
మనుట నాభాగ్యమని యెంతు ననుచు హనుమ
మధుర వాక్కుల ధరజకు ముదము తోడ

597. ‘‘జనని! వినుము వనజ నయనుడు రాముడు
ముఖము పూర్ణచంద్రు బోలు నమ్మ!
కోటిసూర్యసదృశకాంతిమంతుడు బుద్ధి
కమర గురుడు కీర్తి కింద్రసముడు

598. విపులవక్షు డాజానుబాహు డినవంశ
వర్ధను డసమాన బ్రహ్మచర్య దీక్షి
తుండు దుందుభి ధ్వానగళంబు వాడు
నిరుపమానుడు కరుణకు నిలయుడమ్మ

599. వేద వేదాంగ విదు డాశ్రీత జనవత్స
లుం డరిభయంకరు డసమాన శౌర్యు
డప్రమత్తుడు సాధుసంరక్షణమున
రామభద్రుడు త్రిభువనరంజనుండు

600. అన్నిటం బోలు నన్నను లక్ష్మణుండు
శ్యామవర్ణుడు రాముడు హేమవర్ణు
డమ్మ సౌమిత్రివారి వ్యత్యాసమిదియె
నీకు దూరమై దుఃఖార్తి నున్న వారు

601. రామచంద్రుడు నీ వియోగమున దుఃఖ
మనుభవించుచు నన్నపానముల మరచె
రాత్రులందు నిద్రకు దూరమయ్యె నమ్మ!
ఉదయ పద్మము జూచి నీవని దలంచు

602. నీ సమాచారమును విన్న తక్షణంబె
కీశవానరభల్లూక సేనతోడ
సాగరము దాటి లంకకు జేరి తల్లి
సకలరాక్షసులతొ రావణుని వధించు

603. వినుట కానంద కరములౌ హనుమ వచన
ములకు వికసించె మదమున నిలజ ముఖము
తల్లి నీక్లేశములు యిక తొలగు నమ్మ
రాఘవేంద్రుని గలసెదు శీఘ్రముగను

604.అనుచు హనుమంతు డిది గనుగొనుము ల్లి!
ఆనవాలుగ నీకు రఘూద్వహుండు
నిచ్చినాడంచు రామ నామాంకితమగు
ముద్రికను సీత కర పద్మమందు నుంచె
*

టంగుటూరి మహాలక్ష్మి