జాతీయ వార్తలు

అసమ్మతి, విమర్శలే ప్రజాస్వామ్యానికి పునాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్య * సంప్రదాయాలను పరస్పరం గౌరవించుకోవాలని పిలుపు

న్యూఢిల్లీ, నవంబర్ 26: అసమ్మతి, విమర్శ అన్న రెండు అంశాలు ప్రజాస్వామ్యంలో అంతర్భాగమైనట్లు వ్యక్తిగత హక్కులు, స్వేచ్ఛ అతి పవిత్రమైనవని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని ఆయన గౌరవార్థం నిర్వహిస్తున్న రెండు రోజుల ప్రత్యేక సమావేశంలో ఆమె ప్రారంభోపన్యాసం చేశారు. స్వేచ్ఛ, సమానత్వం, సమాన న్యాయం అన్న త్రిసూత్ర ప్రాతిపదికపై బలమైన పునాదులపై మన ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మితమై ఉందని ఆమె చెప్పారు. మేథావులు వ్యక్తం చేసే అసమ్మతి, విమర్శలు ప్రజాస్వామ్య బలోపేతానికి దోహదపడతాయని ఆమె చెప్పారు. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, వాక్, మత స్వాతంత్య్రాన్ని రాజ్యాంగం ప్రసాదించింది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లడంలో ఏకాభిప్రాయ సాధన కీలక పాత్ర వహిస్తుంది. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు పరస్పరం సహకరించుకుంటూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలని ఆమె సూచించారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు ఎలాంటి ఢోకా లేదని ఆమె చెప్పారు. శాంతియుతమైన సహజీవనం, కులం, మతం, జాతి, భాషతో నిమిత్తం లేకుండాప్రశాంత జీవితం గడిపే అవకాశాలున్నాయని ఆమె చెప్పారు. ప్రపంచ దేశాలకు చెందిన అనేక మంది మన దేశంలో ఉంటున్నారని చెబుతూ, ఒకరి మతం, సంస్కృతి, సంప్రదాయాలను పరస్పరం గౌరవించుకున్నప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుందని ఆమె చెప్పారు. అంబేద్కర్ దూరదృష్టితో రూపకల్పన చేసిన రాజ్యాంగం అన్ని అటుపోట్లకు తట్టుకుంటూ ప్రజలకు వరప్రసాదంగా ఉందని ఆమె కీర్తించారు. చట్టసభలు, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాక వర్గం పరస్పరం సహకరించుకుని, సామరస్యంగా పని చేసినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని ఆమె చెప్పారు. ప్రజావసరాలకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు తప్పవని ఆమె చెప్పారు. ఇంతవరకూ సాధించిన విజయాలను చూసి పొంగిపొతూ విశ్రాంతి తీసుకోకుండా ముందున్న పెనుసవాళ్లును అధిగమించటానికి ప్రజాప్రతినిధులు కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు. (చిత్రం) భారత రాజ్యాంగంపై పార్లమెంటులోని లైబ్రరీలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో స్పీకర్ సుమిత్రా మహాజన్, డిప్యూటీ స్పీకర్ తంబిదురై తదితరులు