జాతీయ వార్తలు

దేశవ్యాప్తంగా వేసవి తాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: మే నెల రాకముందే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వేసవి ఎండలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అధికం కావడంతో జనం ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఎపి, తెలంగాణ, ఒడిశా, యుపి, దిల్లీ, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో వడగాలుల జోరు పెరిగింది. ఒడిశాలో ఒక్కరోజులోనే 19 మంది ఎండదెబ్బకు మరణించడంతో ఆ రాష్ట్రంలో స్కూళ్లకు ఈనెల 20 వరకూ సెలవులు ప్రకటించారు. ఎండవేడికి తోడు పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వేసవి ప్రభావంతో చాలా చోట్ల రహదారులు బోసిపోతున్నాయి. చాలా రాష్ట్రాల్లో నీటి కొరత అధికం కావడంతో ప్రజలు నానాపాట్లు పడుతున్నారు.