మీకు తెలుసా ?

ఇవి నేలమీదే ఈనతాయి..’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామన్ హిప్పోపోటమస్‌లకు వారసులే అయినా వాటికంటే భిన్నమైన ఎన్నో ప్రత్యేక లక్షణాలున్న పిగ్మీ హిప్పోపోటమస్ (పొట్టి నీటిఏనుగుల)లు అంతర్థాన దశకు చేరుకుంటున్నాయి. సాధారణ నీటిఏనుగులుకన్నా పరిమాణం, బరువులో ఐదోవంతు మాత్రమే ఉండే ఇవి చూడటానికి ముద్దుగా, బొద్దుగా ఉంటాయి. సహారా ప్రాంతంలో సాధారణ నీటిఏనుగులుంటే పిగ్మీహిప్పోలు మాత్రం పశ్చిమ ఆఫ్రికా దేశమైన లైబీరియాలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి. ఆఫ్రికా దేశాలైన సియర్రాలియోన్, గినియా, ఐవరీకోస్ట్‌లో చాలా అరుదుగా ఉంటాయి. సాధారణ హిప్పోలు ఎక్కువసేపు నీళ్లలో గడుపుతాయికానీ పిగ్మీ హిప్పోలు నేలమీద, నీళ్లలోనూ అవసరాన్నిబట్టి బతికేస్తాయి. మామూలు హిప్పోలు పిల్లల్ని కేవలం నీళ్లలోనే కంటే పిగ్మీహిప్పోలు మాత్రం కేవలం నేలమీదే పిల్లల్ని కంటాయి. అప్పుడే పుట్టిన కామన్ హిప్పో పిల్ల బరువు 30 కేజీలుంటే పిగ్మీహిప్పో పిల్ల బరువు 5 కేజీలకు మించదు. బరువు, సైజులో పిగ్మీహిప్పోలు చిన్నవిగా ఉన్నా పరుగులో మాత్రం ఇవి సమవుజ్జీలే. పెద్దహిప్పోలు గుంపులుగా ఉండటానికి ఇష్టపడితే పిగ్మీలు పరిమిత సంఖ్యలో, కొన్నిసార్లు ఒంటరిగా బతకడానికి ఇష్టపడతాయి.

పుట్టినప్పుడు ఇలా...పెరిగాక అలా...
వరాహాల్లా కన్పించే ఈ అరుదైన జంతువు ఓ క్షీరదం. దీని పేరు తాపిర్. ఇవి పుట్టినప్పుడు ఆకర్షణీయమైన పట్టీలు, చారలతో కనిపిస్తాయి. పెద్దవుతున్నకొద్దీ అచ్చం వాటి పెద్దల్లా రూపురేఖలు, రంగులో వాటి పెద్దల్లా మారిపోతాయి. మధ్య, దక్షిణ అమెరికా దేశాల్లో ఇవి కనిపిస్తాయి. తొండంలాంటి ముట్టెవల్ల ఇది పందిలా కన్పించినా దానికీ, దీనికీ ఏమాత్రం సంబంధం లేదు. లక్షలాది సంవత్సరాలనుంచి ఎటువంటి పరిణామాలకూ గురికాని ఈ జంతువుకు గుర్రాలు, ఖడ్గమృగాలూ దగ్గరి బంధువులు. నీళ్లలో ఎక్కువ సేపు గడపడానికి ఇవి ఇష్టపడతాయి. శరీరాన్ని చల్లబరుచుకోవడానికి, శరీరంపై ఉండే పరాన్నజీవులను వదిలించుకోవడానికి అవి ఎక్కువసేపు నీటి మడుగుల్లో ఉంటాయి. మనం రెండుపూటలా ఆహారాన్ని తీసుకున్నట్లే ఇవికూడా రెండుపూటలా ఆకులు, అలములు, కాయలు, పళ్లు తింటాయి. అన్నట్లు వీటిగుంపును ఆంగ్లంలో ‘కేండిల్’ అని పిలుస్తారు తెలుసా.

జీలకర్ర...జీవగర్ర
ఈ ప్రపంచంలో నల్ల మిరియాల తరువాత అత్యధికంగా వినియోగించే సుగంధద్రవ్యం జీలకర్ర. ప్రపంచం మొత్తంమీద ఉత్పత్తి అయ్యే జీలకర్రలో 90 శాతం మనమే ఉత్పత్తి చేస్తున్నాం. అందులో 90 శాతం మనమే తినేస్తున్నాం. ఇరాన్‌లో పుట్టినా ఇండియాలో ఎదిగిన జీలకర్ర మంచి ఆరోగ్యప్రదాయిని. ఎక్కువగా పీచుఉన్న ఈ జీలకర్ర ఉపయోగిస్తే జీర్ణశక్తి పెరుగుతుంది. మధుమేహం, పైల్స్, ఆస్త్మాసహా ఎన్నో రోగాలను నయం చేస్తుంది. వీటిలో ఉండే పీచు పేగులను శుభ్రం చేస్తుంది. జీలకర్రలో ఉండే ప్రత్యేకమైన నూనెవల్ల దానికి ప్రత్యేకమైన వాసన వస్తుంది. తెల్ల, నల్ల మిరియాల్లాగానే జీలకర్రలోనూ రంగులున్నాయి. నల్లజీలకర ను ‘షాజీర’గా పిలుస్తారు. దీనికి ఘాటు కాస్త ఎక్కువ.

వైట్ ఎలిఫెంట్స్ తెల్లగా ఉండవు!
ఇంద్రుడి ఏనుగు తెల్లగా ఉంటుందని (ఐరావతం) చెబుతారు. భూమీదకూడా తెల్లఏనుగులున్నాయి. కానీ అవి పూర్తిగా శే్వతవర్ణంలో ఉండవు. పేరుకు తెల్లఏనుగులే అయినా అవి కాస్త బూడిద లేదా ఎరుపు లేదా పింక్ లేదా ఎరుపురంగులో కన్పిస్తాయి. వీటినే ఆల్బేఏనుగులనికూడా పిలుస్తారు. వైట్ ఎలిఫెంట్స్‌కు, ఆల్బే ఎలిఫెంట్స్‌కు కాస్త తేడాలున్నాయని చెప్పాలి. ప్రస్తుతం ఈ తెల్లఏనుగులు థాయ్‌లాండ్, మయన్మార్‌లో మాత్రమే ఎక్కువగా కన్పిస్తాయి. తెల్లఏనుగులంటే రాజ్యాధికారం, ఆధిపత్యం, సంపద లభిస్తాయని విశ్వాసం. థాయ్‌లాండ్ రాజకుటుంబంవద్ద పెద్దసంఖ్యలో ఇవి ఉన్నాయి. అలాగే మయన్మార్ ప్రభుత్వంకూడా వీటి అతి జాగ్రత్తగా సాకుతోంది. ఈ రెండు ప్రాంతాల్లో మినహా మిగతాచోట్ల అవి దాదాపు లేవనే చెప్పాలి. ఒకటీ అరా ఉన్నా ఇక్కడున్నంత ఆరోగ్యంగా, అందంగా ఉండవు. ఆఫ్రికాలో ఎర్ర ఏనుగులు, ఊదారంగులో ఉండే ఏనుగులు కన్పిస్తాయి. అక్కడక్కడ కాస్త లేతపసుపువర్ణంలో ఉండే ఏనుగులూ ఉన్నాయి.

-ఎస్.కె.కె.రవళి