అవీ .. ఇవీ..

మనోహరం...ఈ దృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔను..ఈ ఫొటోలు చూస్తే అదే అనిపిస్తుంది. సృజనాత్మకత, ఓపిక, అకుంఠితదీక్ష కలగలసిన లక్షణాలున్న ఫొటోగ్రాఫర్ల పనితనానికి ఈ చిత్రాలు ఉదాహరణ. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ‘స్మిత్‌సోనియన్’ పత్రిక పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ ఫొటోగ్రాఫర్ల ఎంపికకోసం ఓ పోటీని ప్రకటించింది. ఈ పోటీలో పాల్గొంటూ 160 దేశాలకు చెందిన ఫొటోగ్రాఫర్లు దాదాపు 46000 ఫొటోలను పంపారు. వాటిలో ఉత్తమమైనవాటిని కొన్నింటిని ఎంపిక చేసి ఆ మ్యాగజైన్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. విజేతను ఎంపిక చేసుకునే అవకాశం పాఠకులకు వదిలిపెట్టింది. ఆ ఫొటోలను చూసి నచ్చినదానికి ఓటువేస్తే మెజారిటీ ఓట్లు దక్కిన ఫొటో తీసిన ఫొటోగ్రాఫర్‌ను విజేతగా ప్రకటిస్తారన్నమాట. తన పెరట్లో ఓ పుష్పంకింద కూర్చుని గింజలుతింటున్న ఓ ఎర్రఉడతను చూసి క్లిక్‌మన్పించాడు గోర్త్‌వెగ్గెన్ అనే ఫొటోగ్రాఫర్. అలాగే ఒక ఎల్లోహెడెడ్ జా ఫిష్ నోటిలో గుడ్లుదాచిపెట్టి పొదగడానికి సిద్ధపడిన దృశ్యాన్ని గంటపాట పరిశీలించి నెమ్మదిగా అది నోరు తెరిచిన తరువాత క్లిక్‌మన్పించాడు మరో ఫొటోగ్రాఫర్ సుజాన్ మెర్దోనియన్. ఇలాంటి అద్భుతమైన ఎన్నో ఫొటోలు ఇప్పుడు ఆ మ్యాగ్‌జైన్‌లో దర్శనమిస్తున్నాయి. ఉత్తమమైనవాటిని ఎంపిక చేయడం అంతసులువైన పనేంకాదు. ఎందుకంటే ప్రతి ఫొటోలో ఏదో ఒక అద్భుతం దాగి ఉంది.

అక్వేరియంలో షో
అందరిమధ్య ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేస్తే గొప్పేముంది. ఇదిగో ఇలా అక్వేరియంలో అందమైన దుస్తులతో స్విమ్ చేస్తే మజా తెలుస్తుంది. బీజింగ్‌లోని ఓ జూలో అక్వేరియంలో నిర్వహించే ఫ్యాషన్ షోకోసం మోడల్స్ ఇలా వినూత్నమైన దుస్తులతో ప్రాక్టీస్ చేస్తున్నారు.

ఈగిల్ హంటర్
ఎతె్తైన కొండలపై దట్టంగా మంచుకప్పుకున్న వేళ..గుర్రాలను అధిరోహించి, పెంచిన గద్దలను వదిలి జంతువులను వేటాడటం ప్రపంచంలోనే అతి పురాతన సంప్రదాయం. మంగోలియా, ఖజికిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ సంప్రదాయం బతికేఉంది. దానిని కాపాడుకునేందుకు అక్కడి ప్రజలు తహతహలాడుతూంటారు. ప్రత్యేకించి ఒకజాతి ప్రజలకు మాత్రమే చెందిన కళ. ప్రపంచంలో ఈ కళ తెలిసినవారు వెయ్యిలోపే ఉంటారు. గద్దలతో వేటాడిన జంతువుల చర్మం, బొచ్చు చేసిన దుస్తులను ధరించడం వీరి ప్రత్యేకత.

అందం చూడవయా!
ప్రస్తుత ప్రపంచంలో అందానికి ఇచ్చే ప్రాధాన్యత అంతాఇంతాకాదు. దుస్తులు, మేకప్, కేశసంపద ఇలా అన్ని విషయాల్లో వినూత్న, ఆధునిక పోకడలకు పట్టంగడుతోంది ఈలోకం. ఇదిగో టోక్యో ఫ్యాషన్ వీక్‌కోసం ఎంగ్యున్ కాంగ్ త్రి అనే మోడల్ ఇలా వినూత్న దుస్తులతో దర్శనమిస్తే బెర్లిన్ ఫ్యాషన్ వీక్‌కోసం వినూత్న మేకప్‌తో సిద్ధమైంది మరో మోడల్.

-భరతి