AADIVAVRAM - Others

నైరుతి మూల వీధి పోటు (వాస్తు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నారెడ్డి (గుత్తి)
ప్రశ్న: మేము నివసిస్తున్న ఇంటికి దిక్కులు తిరిగి ఉంటాయి. అంటే తూర్పు దిశ అనుకున్నది ఆగ్నేయం అవుతున్నది. అలా ఉండవచ్చునా?
జ: దిక్కులు తిరిగిన స్థలంలో నివసించడం వలన కొన్ని సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా మీరు నివసిస్తున్న ఇంటికి ఆగ్నేయం రోడ్డు వలన ఆడవారికి అనారోగ్య సమస్యలు, ఇంట్లో చిన్నచిన్న తగాదాలు, కేసులు, బంధువులతో అకారణ శత్రుత్వం, అలాగే ఇంకొన్ని సమస్యలు ఉంటాయి. దిక్కులను మార్చడం వీలుకాదు కాబట్టి దీనికి సంబంధించి దోష నివారణ యంత్రాలు ఉంటాయి. వాటి ద్వారా దోష నివారణ జరుగుతుంది.
చిన్నప్ప (కోడూరు)
ప్రశ్న: కొత్త ఇంటి నిర్మాణం చేద్దామనుకొంటున్నాను. వాస్తు ప్రకారం యంత్రాన్ని ప్రతిష్ఠించుకోవాలా?
జ: శంకుస్థాపన సమయంలో స్థల దోష నివారణ కోసం ఒక యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు.
చైతన్య (కర్నూలు)
ప్రశ్న: మా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ ఇంటిని అమ్ముదామన్నా, దగ్గర దాకా వచ్చి బేరాలు పోతున్నాయి. కారణం తెలియడం లేదు. మేం ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఇల్లు అమ్మడమే మార్గం. ఇల్లు త్వరగా అమ్ముడయ్యే మార్గం తెలుపగలరు.
జ: మీ ఇంటికి కొన్ని వాస్తు దోషాలు ఉన్నాయి. అందువల్లనే ఆ ఇల్లు అమ్ముడు పోవటంలేదు. ఆ దోష నివారణ గురించి కొన్ని యంత్రాలు ఉంటాయి. వాటిని తీసుకొని ప్రతిష్ఠించుకొన్నట్లయితే 41 రోజుల లోపల మీ ఇల్లు అమ్ముడుపోతుంది.
దుర్గాదేవి (ఒంగోలు)
ప్రశ్న: మా ఇంటికి నైరుతి మూలలో వీధి పోటు ఉంది. ఈ వీధిపోటు చెడు ఫలితాలను ఇస్తుందని కొందరు అంటున్నారు. మేం ఇటీవలనే ఈ ఇల్లు నిర్మించుకున్నాం. దీనికి నివారణ తెలుపగలరు.
జ: నైరుతి వీధి పోటు వలన ఆర్థిక, ఆరోగ్యపరంగా సమస్యలు వస్తాయి. అలాగే అనుకోకుండా ప్రమాదాలు కలుగుతాయి. కావున ఆ వీధిపోటు నివారణ కోసం వీధిపోటు నివారణ యంత్రాన్ని ప్రతిష్ఠించుకొని శుభ ఫలితాలను పొందండి.
మైథిలి (విజయవాడ)
ప్రశ్న: మా ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. నిర్మాణం త్వరగా పూర్తవడానికి నివారణ తెలుపగలరు.
జ: మీ ఇంటి స్థలంలో దోషాలు ఉన్నాయి. అందువల్లనే ఇంటి నిర్మాణం ఆగిపోయింది. ముందుగా దోష నివారణ చేసుకొని ఆ తర్వాత ఇంటి నిర్మాణం మొదలుపెట్టండి.
సన్యాసిరావు (వైజాగ్)
ప్రశ్న: మా ఇంటికి దక్షిణంలో కాలువ ఆగ్నేయం నుండి నైరుతి మూలకు ప్రవహిస్తూ ఉంది. దీనివల్ల ఏమైనా దోషం ఉంటుందా? ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుండి చాలా సమస్యలు వస్తున్నాయి.
జ: కాలువ దక్షిణంలో ప్రవహించడం చాలా పెద్ద దోషం. అది కూడా ఆగ్నేయం నుండి నైరుతి మూలకు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అనుకోకుండా ప్రమాదాలు, ఆర్థిక నష్టాలు కలుగుతాయి. దోష నివారణ యంత్రాన్ని ప్రతిష్ఠించుకొని శుభ ఫలితాలను పొందండి.

-వాస్తు శిఖామణి చివుకుల రాఘవేంద్ర శర్మ -96 42 70 61 28