గ్రహానుగ్రహం

రత్నశాస్త్రం (గ్రహానుగ్రహం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రత్నములు ధరించడం వలన జాతకంలో లేని యోగములు కూడా సిద్ధిస్తాయి అని అనుకోవడం చాలా తప్పు. నేటి సమాజంలో వ్యాపార ధోరణితో ఈ ‘రత్నశాస్త్రం’ ఉపయోగిస్తున్నారు. ఈ రత్నం పెట్టుకోండి మీకు ఆరోగ్యం బాగుంటుంది. ఈ రత్నం పెట్టుకోండి మీకు ఉద్యోగం వస్తుంది. అలాగే వివాహం, సంతానం వంటివి ఎన్నో అంశాల మీద చాలా ఉపన్యాసాలు చెప్పి రత్నాలు ధరింపజేస్తున్నారు. కానీ వారికి ప్రాథమిక ధర్మం అయిన ‘కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన’ అనే గీతాచార్యుడి ఉపదేశం విస్మరిస్తున్నారు. ‘ఈ రత్నం ధరించండి మీ శ్రమ త్వరగా ఫలిస్తుంది’ అని కార్యోన్ముఖులను చేయించడం విస్మరిస్తున్నారు. ఒక విద్యార్థి రత్నం పెట్టుకున్నంత మాత్రాన పరీక్షల్లో ఉత్తీర్ణుడు అవుతాడా? లేక చదివితే ఉత్తీర్ణుడవుతాడా? - చదివితేనే ఉత్తీర్ణుడవుతాడు. మరి రత్నం ఆ విద్యార్థి చదువుకు ఎలాగ ఉపయోగపడుతుంది. పరీక్షల సమయంలో ఒత్తిడి నుండి జయించడానికి దృష్టి మరలకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ‘నూరు శాతం రత్నం మనిషికి అవసరమే’. అయితే ధరింపని కారణంగా ఏదో కోల్పోయాము అనుకోవద్దు. ధరించి మనం చేయవలసిన ధర్మాలు మనం చేయకపోతే కూడా తప్పు. కేవలం రత్నం జీవితాన్ని మార్పు చేస్తుంది అని నిత్య జీవితంలో ఏ పనీ చేయని సోమరిపోతులకు కూడా మానసిక పరిస్థితిలో మంచి రత్నం మంచి ఫలితాన్ని ఇస్తుంది. రత్నం మాదిరిగానే యంత్రం, పూజ, వాస్తు, రుద్రాక్ష, యోగా, మెడిటేషన్ వంటివి కూడా పని చేస్తాయి. రత్నం ధరించాలి. మన ప్రయత్నం మనం చేస్తూండాలి. రత్నం ధరించాం పని అయిపోతుంది అని ప్రయత్నం మానకూడదు. నేటి రత్న శాస్తవ్రేత్తలు గీతాచార్యుని వాక్యాన్ని అవహేళన చేయు రీతిగా రత్నం ధరించమని చెప్పి కార్యోన్ముఖులుగా వున్నవారి మానసిక స్థితిని నిర్వీర్యం చేయు విధంగా మాటలు చెబుతున్నారు. ఇక సంప్రదాయములు - ఈ రత్నాల వలన పాడైన తీరు చెప్పనక్కర్లేదు. ఆడవారు సౌభాగ్య వృద్ధి కోసం నిత్యం పగడం, ముత్యం, నల్లపూసలు వీటిని మంగళ సూత్రాలలో ధరిస్తారు. అలాగే రత్న ధారణ వలన ఐశ్వర్య వృద్ధి అని మన సంప్రదాయం. రవ్వల ముక్కుపుడక ధరిస్తే భర్తతో అనుకూలం అని పెద్దలు చెబుతారు. అంతేకాకుండా ఉన్నతం అయినది - వజ్రం. అది ముఖం మీద ముక్కుపుడక ద్వారా కనపడుట వలన ఆ స్ర్తి నివసించే ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని ‘రవ్వ ముక్కుపుడక’ అనగా వజ్రంతో చేసిన ముక్కు పుడక తప్పక ధరించేవారు స్ర్తిలు. మరి నేడు ముక్కు పుడక ధారణ పోయింది. నల్లపూసలు కూడా ధరించవచ్చా? నా జాతకమునకు సరిపోవునా? లేదా? అనే స్థితికి సంఘం దిగజారింది. ‘నల్ల పూసలు వేసుకోనా’ అనడం మనం పరిశీలించనవసరం లేదు. ‘నల్లపూసలు నా జాతకరీత్యా ధరించవచ్చా?’ అనే ప్రశ్నకు బాధపడాలి. రత్నశాస్త్రం, రత్న వ్యాపారం, రత్నధారులు అందరూ అతి ఆలోచనలలో సంప్రదాయాన్ని పాడుచేశారని. ఇక లలిత సహస్ర నామ భాష్యం బోధించేవారు ‘నాసాభరణ భాసురా’ ‘నాసాదండ విరాజితా’ అనే నామముల అర్థం విశే్లషించే సందర్భంలో సౌభాగ్యం కోసం ‘వజ్రపు ముక్కుపుడక’ ఐశ్వర్య వృద్ధి కోసం ‘వజ్రపు ముక్కుపుడక ధారణ’ వలన కలిగే లాభాలు, మన ఆచారం వివరిస్తూ ఉంటారు. మరి ఒకసారి మన ఆచార వ్యవహారాలను పరిశీలిస్తే ఆడవారు పగడం, ముత్యం, నల్లపూసలు, వజ్రం ధరించే విషయంలో జాతకములు విసిరిపారవేస్తారు. కారణం అవి ఐశ్వర్యం సౌభాగ్యం ఆడవారి విషయంలో. అందుకే పూర్వం ఆడవారికి ఏడువారాల నగదులు ధరించే ఐశ్వర్యం కలిగింది.

కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు)
కామకోటినగర్, శంకరమఠం వీధి, నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ - 520 012.

కప్పగంతు సుబ్బరామశర్మ -9848520336