మనలో - మనం

మనలో మనం ( ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుష్యమీసాగర్, హైదరాబాద్
పేరున్న టీవీ చానెల్‌లో హాస్యానికి సంబంధించి ఒక కార్యక్రమం విపరీతమైన ప్రజాదరణ పొందినా, అందులోని ‘హాస్యం’ దిగజారుడుతనానికి ప్రతీక అయ కూర్చుంది. ద్వందార్థపు మాటలు, నీతి తప్పిన పనులు, అక్రమ సంబంధాలు తప్పు కాదనే భావన... ఇవన్నీ అందులో గొప్పగా చూపించబడతాయ. విషాదం ఏమిటంటే వాటికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించేవారిలో ఒక మహిళా ప్రతినిధి ఉండటం. మహిళల పట్ల జుగుప్సగా వ్యవహరించడం కూడా హాస్యం అనుకోమనడం శోచనీయమే కదా? సినిమాలకి సెన్సార్ ఉన్నట్టు... బుల్లితెరకి కూడా ఉంటే బాగుంటుందేమో కదా?
సెన్సారు వల్ల సినిమాల్లో వెకిలితనం తగ్గిందా? తప్పు పట్టాల్సింది చెత్త ప్రోగ్రాంలను విరగబడి చూసే జనాన్ని.

ఉపాధ్యాయుల రామం, తొర్తిపాడు
ఎవరి (ప్రధానితో సహా) కార్లపైనా ఎర్రబుగ్గల తొలగింపు నిర్ణయం తీసుకున్న పెద్దలు, ముఖ్యులు వెళ్లేదారిలో ట్రాఫిక్ గంటల తరబడి ఆపెయ్యడం లాంటి చర్యలు కూడా కూడదు అన్న నిర్ణయం తీసుకోగలరా?
అది మాత్రం అడగొద్దు.

ఎల్. ప్రపుల్లచంద్ర, ధర్మవరం
ఎన్నికలొస్తున్నాయ. పండగ ఎవరికంటారు?
తెలివిమీరిన ఓటర్లకు.

పి.వి. శివప్రసాదరావు, అద్దంకి
మావోయస్టులు 26మంది జవాన్లను కాల్చి చంపితే పౌర హక్కుల సంఘం నేతలు ‘అయ్యో పాపం’ అని నోరెత్తి ఖండించరేమి? అదే వాళ్లని చంపితే అన్యాయమని రాద్ధాంతం చేస్తారెందుకు?
అవి ఎర్రగూటి చిలుకలు.

ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్
కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే తన ఇంట్లో విచారణకు తాఖీదులు పంపాడట. ఎంత విడ్డూరం. ఆయనకు ఉద్వాసన ఎందుకు చెప్పరు?
మొండిజడ్జి సుప్రీంకోర్టు కంటే బలవంతుడు!

మే నెల ఒకటవ తేదీ కార్మికుల దినం పేరిట అన్ని కర్మాగారాలకు సెలవు. సర్వీస్ చేసే బ్యాంకులకు కూడా సెలవే. విద్యాసంస్థలకు కూడా ఈ సెలవును వర్తింపచేయొచ్చు కదండి.
‘బాలకార్మికుల’ కోసమా?!

కె.ఎం.రావు, అమలాపురం
చీరలు, సారె, దేవాలయాలకు తీసుకెళ్ళడం, అర్ధనగ్నంగా పొర్లుదండాలు పెట్టే ఉద్యోగం మీకు ఇప్పించాలని ఉంది. (గవర్నర్‌గిరీ) ఓర్పుగా చెయ్యగలరా?
వేకెన్సీ వస్తే గదా?

గోనుగుంట మురళీకృష్ణ, రేపల్లె
పాత సినిమాలో ట్రాన్సిస్టర్ అనే మాట విన్నాను. రేడియో, టేప్ రికార్డర్ తెలుసుగానీ, ట్రాన్సిస్టర్ ఎప్పుడూ చూడలేదు. ట్రాన్సిస్టర్‌కి మిగిలిన రెండింటికీ తేడా ఏమిటి?
బాటరీతో నడిచే రేడియోను ట్రాన్సిస్టర్ అనేవాళ్లు.

ఎం. కనకదుర్గ, తెనాలి
మా ఊళ్లో కన్పించిన బ్యానర్‌లో మాటలు ఈ విధంగా ఉన్నాయ. ‘‘ఇ రొఝు వైధ్య సిభిరంలో ఆందరు పాలుగొని వలసిందిగా మామానవి’’ - ఇదేమిటయ్యా అని అడిగితే ఇంగ్లీషులో ప్రకటన రాసి గూగుల్ తెలుగు ద్వారా అనువాదం చేశారని సదరు నిర్వాహకులు సెలవిచ్చారు. కంప్యూటర్ సాయంతో తెలుగులో నాలుగు మాటలు రాసుకోవాల్సిన దౌర్భాగ్యమేమిటండి?
తలా ఒక చెయ్య వేసి తెలుగు భాషను చావగొట్టి చెవులు మూశాము కదా? ఇదే మన గతి.

ఎ.వి.జి.కృష్ణ, విశాఖపట్టణం
అమరావతిలోని ఏ.పి. ప్రభుత్వ ఉద్యోగులు ఉ.11.30 అయనా అందరూ రారని, మధ్యాహ్నం 3.30కే బైబై చెప్పి వెళ్లిపోతారని ఒక పత్రికలో రాశారు. ఎన్జీఓలు అంటే చండశాసనుడికి అంత భయమా?
కొత్త సంసారం... దూరాభారం... రైళ్ల ప్రయాణం కూడా బహుశా ఒక కారణం.

టి. సత్యనారాయణ మూర్తి, వైజాగ్
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిడిపి, బిజెపి, శివసేన కలిసి ఉమ్మడి గ్రూపుగా ఒకటిగా బరిలోకి దిగుతాయ. ఇది సత్యం. కావాలంటే ఎవరైనా కాగితంపై రాసి వుంచుకోండి అని ఒక టిడిపి ఎమ్మెల్యే బహిరంగ సభలో చెప్పారు. ముందస్తు అవగాహన కుదిరిందా?
అది పాత అవగాహనే కదా?

మొన్న ఓ సభలో ‘జయంతి’ని ‘వర్ధంతి’గా వర్ణించిన లోకేష్ - నిన్న తాగునీటి కష్టాలను పునరుద్ధరిస్తానని, ఇవాళ రాబోయే ఎన్నికల్లో 200 సీట్లు టిడిపికి గెలిపించాలని ఉద్ఘాటించారు...
శభాష్!

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా

మనలో మనం,
ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక,
36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్ - 500003.

: email :
sundaymag@andhrabhoomi.net