AADIVAVRAM - Others

షుగరు వ్యాధిలో మెదడు సంరక్షణ (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రశ్న: నా వయసు 65 ఏళ్లు. 90 కిలోల బరువు. పాతికేళ్లుగా షుగరు వ్యాధితో బాధపడ్తున్నాను. రానురానూ జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది. మనసుకు సంతోషం ఉండట్లేదు. నివారణ చెప్పగలరు.
జ: అగ్ని, వాయువు తోడైతే దావానలం వ్యాపిస్తుంది. వీటికి తోడు వరద ప్రమాదాలు కూడా చేరితే పరిస్థితి ఊహాతీతం అవుతుంది. షుగరు వ్యాధి వాయువు లాంటిది. బీపీ వ్యాధి అగ్ని. స్థూలకాయం వరద ప్రమాదం లాంటిది. ఈ మూడు కలిస్తే ఉప్పెన పెనుముప్పులా ముంచుకొస్తుంది. అందుకే, స్థూలకాయం, షుగరూ, బీపీ ఉన్నవారు ఇతరులకన్నా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. యూరోపియన్ మధుమేహ అధ్యయన సంస్థ వారి జర్నల్ జ్ఘఇళఆ్య్యజ్ఘ లో ఇటీవల ఫ్రచురించిన వివరాల్లో స్థూలకాయుల్లో వచ్చే షుగరు వ్యాధి వలన మెదడుకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నదని స్పష్టంగా పేర్కొన్నారు.
రక్తంలో షుగరు స్థాయి కంట్రోల్లో ఉండటం అవసరమే! కానీ, షుగరు కంట్రోల్లో ఉన్నంత మాత్రాన శక్తి ఉత్పత్తి బ్రహ్మాండంగా జరిగినట్టు కాదు కదా! శక్తి ఉత్పత్తి తగ్గినందువలన శరీరంలో శక్తి సరఫరా కూడా తగ్గుతుంది. శరీరంలో గుండుసూది మొన మోపినంత మేరకు కూడా శక్తి తగినంత అందాలి. ఉత్పత్తి తగ్గితే సరఫరా తగ్గి అణువణువూ శరీరంలో శక్తి హీనం అవుతాయి. షుగరు వ్యాధి దీర్ఘకాలంగా ఉన్న వారిలో అనేక ఉపద్రవాలు రావటానికి ఇది ముఖ్య కారణం. షుగరు కంట్రోల్లోనే ఉన్నా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ తప్పవని దీన్నిబట్టి అర్థం చేసుకోవాలి.
పంచజ్ఞానేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, నాలుక, చెవులు, చర్మం వీటి మీద తొలి ప్రభావం కనిపిస్తుంది. పోనుపోనూ ముఖ్య అవయవాలైన గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల్లాంటివి చెడటం మొదలౌతాయి. ఇప్పుడు కొత్తగా శాస్తవ్రేత్తలు చేస్తున్న హెచ్చరిక మెదడు కూడా త్వరగా దెబ్బతింటుందని! అందుకే ‘ఏ బాధ కలిగినా మీకు షుగరు ఉన్నది కదా! సైడ్ ఎఫెక్టులు తప్పవు’ అనటం డాక్టర్ల నుంచి తరచూ వింటూ ఉంటాం.
ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే షుగరు వ్యాధిని గుర్తించిన మొదటి రోజు నుండే తగిన జాగ్రత్తలకు అలవాటు పడగలిగితే ఇవ్వాళ వచ్చే సైడ్ ఎఫెక్టులను రేపటికి వాయిదా వేయటానికి అవకాశం ఉంటుందని!
షుగరు వ్యాధి కారణంగా మెదడు పైన కలిగే వత్తిడి వలన డిమెన్షియ ఏర్పడే అవకాశం ఉందని పరిశోధనలు చెప్తున్నాయి. మెదడు శక్తిహీనం కావటం, మతిమరుపు, ఆందోళన, దిగుళ్లతో కూడుకున్న లక్షణాలు ఏర్పడతాయి. ఇన్సులిన్ పని చేయకపోవటం, రక్తంలో షుగరు పెరిగిపోవటం, సున్నితమైన కండరాల్లో వాపులు ఇవి డిమెన్షియాకు దారితీయవచ్చు. ఇవి స్థూలకాయంతో ముడిపడి ఉండటాన్ని శాస్తవ్రేత్తలు ప్రత్యేకంగా గుర్తించారు. శారీరకంగా, మానసికంగా, నరాల పరంగా అనేక లక్షణాలు కలగటానికి ఊబకాయం కారణం అవుతుందని ఈ పరిశోధన సారాంశం.
ఇప్పుడు మధుమేహ వ్యాధి బారిన పడిన రోగులు అన్నింటికీ మందులతో పరిష్కారాన్ని కొనుక్కోవచ్చనే ఆలోచన వదిలేసి జాగ్రత్తలు పాటించటం మంచిది.
‘రాజ భోజనాలు శవపేటికలను నింపటానికే’ (Large dinners fill coffins) అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. ఆహార వ్యామోహం అసలుకే మోసం తెస్తుంది. ఇతర వ్యామోహాలకన్నా ఆహార వ్యామోహం ప్రమాదకరమైంది.
కంప్యూటర్లో వైరస్ చేరినప్పుడు అనవసర యాపులన్నిటినీ డౌన్‌లోడ్ చేసుకోమని అడ్డుపడుతూ ఉంటుంది. స్థూలకాయుల పేగుల్లో కూడా ఒక ప్రత్యేకమైన సూక్ష్మజీవి కంప్యూటర్ వైరస్‌లానే ఏది కనిపిస్తే అది తినాలని కోరికని ప్రేరేపిస్తుందని కొత్త పరిశోధనాంశం ఒకటి ఈ మధ్యే వెలుగులోకి వచ్చింది. శరీర యంత్రాంగాన్ని చెడగొట్టడమే ఈ క్రిమి లక్ష్యం. అనారోగ్యకర వంటకాలను చూడగానే కొవ్వు కణాలను ప్రేరేపించి, ఎక్కువ ఆహారం కోసం మెదడుకు సిగ్నల్స్ పంపేలా చేస్తుంది. ఇంకో ముద్ద అదనంగా తినాలనే కోరికని పెంచుతుంది. నెరుూ్య, నూనె, పులుపు, తీపి, ఉప్పు వీటి మీద మనలో ఎక్కడలేని వ్యామోహాన్నీ రేకెత్తించే అంశాలు. స్థూలకాయుల్లోనూ, షుగరు వ్యాధి వచ్చిన వారిలోనూ ఈ వ్యామోహాన్ని జయించగలగటమే అసలు పరిష్కారం. మనోబలమే యాంటీ వైరస్‌లా పనిచేస్తుంది.
మెదడు అనేది శరీరం మొత్తం బరువులో 2% మాత్రమే ఉండగా అది గుండె నుంచి బయటకు వచ్చే శుద్ధ రక్తంలో 15 శాతాన్ని, శరీరం మొత్తం తీసుకునే ఆక్సిజన్‌లో 20 శాతాన్నీ, అలాగే శరీరం మొత్తం వినియోగించుకొనే గ్లూకోజులో 25 శాతాన్నీ ఉపయోగించుకుంటోంది. శరీరంతో చేసే వ్యాయామం కన్నా మెదడు శ్రమకు ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. మెదడుకి మనం పని చెప్పే కొద్దీ అది శరీరంలో శక్తిని తీసుకొని ఖర్చు చేస్తుంది. ఆ విధంగా చురుకైన ఆలోచనా శక్తి మధుమేహాన్ని అదుపులో పెట్టేందుకే తోడ్పడుతుంది.
ఆందోళనలు, దిగుళ్లు మెదడు శక్తిని హరిస్తాయి. షుగరు, స్థూలకాయం పెరగటానికి కారణం అవుతాయి. చింతా శోక భయ దుఃఖాదులన్నీ తక్షణం వాతాన్ని పెంచుతాయని ఆయుర్వేదం చెప్తుంది. మనసుకు సంతోషం, సంతృప్తి కలిగించని అంశాలన్నీ ఈ వ్యాధిని పెంచుతాయనే దీని అర్థం. మనసుదే ఇందులో ప్రముఖ పాత్ర. దాన్ని వ్యాధి నివారణకు అనుకూలంగా సన్నద్ధం చేసుకోవాలి.
స్థూలకాయం పెరగటానికి, షుగరు వ్యాధి పెరగటానికి, వీటికి రక్తపోటు కూడా తోడు కావటానికి వ్యక్తి జీవన విధానం ముఖ్య కారణం అవుతుంది.
లైఫ్ స్టయిల్ అనే మాట వెనుక చాలా అర్థాలున్నాయి. అపకారం చేసే రుచుల మీద వ్యామోహంతోనూ, మానసిక వత్తిడులతోనూ, అసంతృప్తితోనూ, దిగుళ్లు ఆందోళనలతోనూ రోజులు సాగుతుంటే, ఎంత విలాసవంతమైన సౌకర్యాలతో జీవిస్తున్నా మెదడుకు తిప్పలు తప్పవు.
శరీర సౌకర్యాలకన్నా మానసిక సౌకర్యాలకు ప్రాధాన్యత నివ్వాలి. తిళ్లు, వత్తిళ్లు ఇవి రెండూ షుగరు, స్థూలకాయాలకు ముఖ్య ప్రేరకాలు. ఈ రెండింటినీ ఎంత అదుపు చేసుకోగలిగితే మెదడు అంత శక్తిమంతంగా ఉంటుంది. షుగరు వ్యాధి అంత అదుపులో ఉంటుంది.

- డా. జి.వి.పూర్ణచందు
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్
సత్యం టవర్స్, 1వ అంతస్తు,
బకింగ్‌హామ్‌పేట పోస్టాఫీసు ఎదురు
గవర్నర్‌పేట, విజయవాడ - 500 002
సెల్ : 9440172642
purnachandgv@gmail.com

- డా. జి.వి.పూర్ణచందు