AADIVAVRAM - Others

చిన్న కునుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మత్తు వదలరా నిదుర మత్తు వదలరా?’ అన్న సినిమా పాటలోని చరణం చదువుకునే పిల్లలు వున్న ఇంట్లో తరచూ విన్పిస్తుంటుంది. సినిమాలు చూసినప్పుడు, కథలు వింటున్నప్పుడు రాని నిద్ర చదువు పుస్తకం చదువుతుంటే వస్తుంది. దానికి కారణం చదువు మీద శ్రద్ధ, ఆసక్తి తక్కువగా ఉండటం.
చాలా మంది నిద్రకి ఎక్కువ కాలం కేటాయిస్తూ ఉంటారు. మరి కొంతమంది నిద్రాహారాలు మాని పని చేస్తూ ఉంటారు. నిజానికి రెండూ సరైనవి కావు. నిద్ర ఎంత అవసరమో అంత మేరకు నిద్రపోవాలి. నిద్రాహారాలు మాని పనిచేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. అదే విధంగా మెలకువతో ఉండి కాలాన్ని వృధా చేయడం ఏ మాత్రం అభిలషణీయం కాదు.
చాలామంది అధికారులకి, మంత్రులకి వాళ్ల గదిని ఆనుకొని మరో చిన్న గది ఉంటుంది. అందులో భోజనం చేయడానికి ఓ చిన్న టేబుల్, ఓ చిన్న మంచం కూడా ఉంటాయి. న్యాయమూర్తుల ఛాంబర్లలో కూడా చాలా పొడుగైన కుర్చీలు ఉంటాయి. వీటిని ‘ఆరామ్ చైర్‌లు’ అంటారు. వీటి ఉద్దేశం నిద్రపోవడానికి కాదు. భోజన సమయంలో ‘శక్తిని ఇచ్చే కునుకు’ను తీసుకోవడానికి. దీనే్న ఇంగ్లీష్‌లో ‘పవర్ నాప్’ అంటారు. ఈ చిన్న కునుకు చాలా అవసరమని పరిశోధనలు వెల్లడించాయి.
బాగా పని ఒత్తిడి ఉన్న ప్రసిద్ధ వ్యక్తులు పనికి కొత విరామం ఇచ్చి చిన్న కునుకు తీస్తూ ఉంటారు. ఈ చిన్న కునుకు ఇచ్చే శక్తి మరేదీ ఇవ్వదని అన్న ప్రసిద్ధులు ఎందరో. ఆల్కహాల్ కన్నా ఈ చిన్న కునుకు ఎంతో ఉత్తేజపరుస్తుందని అన్న ప్రముఖులు ఎంతోమంది ఉన్నారు.
చిన్న కునుకులు జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్రని పోషిస్తాయి. వినె్సంట్ చర్చిల్ పార్లమెంట్ గదిలో మంచం వేసుకొని నిద్రించేవాడు. థామస్ ఎడిసన్ కూడా చిన్న కునుకు తీసి తన ప్రయోగాలు మొదలుపెట్టేవాడట.
సైంటిస్టులకి, రాజకీయ నాయకులకే కాదు అందరికీ ఓ చిన్న కునుకు అవసరమే. ఉత్తేజంగా ఉండటానికి ఉత్సాహంగా పని చేయడానికి.
నిజమే కానీ, నిద్రలు తీస్తేనే ప్రమాదం.