క్రీడాభూమి

సూపర్ - 10కు అఫ్గాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చివరి గ్రూప్ మ్యాచ్‌లో జింబాబ్వేపై సంచలన విజయం
నాగపూర్, మార్చి 12: టెస్టు హోదా ఉన్న జింబాబ్వేను మట్టికరిపించిన అఫ్గానిస్థాన్ జట్టు టి-20 వరల్డ్ కప్ సూపర్-10కు దూసుకుపోయింది. మహమ్మద్ నబీ అర్ధ శతకంతో రాణించడంతో, చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఈ జట్టు 59 పరుగుల తేడాతో ప్రత్యర్థిని ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు సాధించగా, అందుకు సమాధానంగా జింబాబ్వే 19.4 ఓవర్లలో 127 పరుగులు చేసి ఆలౌటైంది. బ్యాట్స్‌మెన్ వైఫల్యమే జింబాబ్వేను ఓడించింది.
మహమ్మద్ షెజాద్, నూర్ అలీ జద్రాన్ తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించడంతో అరంభమైన అఫ్గాన్ ఇన్నింగ్స్ ప్రయాణం, కెప్టెన్ అస్గర్ స్టానిక్‌జాయ్ (0), గుల్బదిన్ నయిబ్ (7) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో ఇరుకున పడింది. అయితే, సమీయుల్లా షెర్వానీ, మహమ్మద్ నబీ జట్టును చక్కదిద్దారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 98 పరుగుల అత్యంత కీలకమైన భాగస్వామ్యాన్ని అందించారు. షెర్వానీ 37 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 43 పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ ఐదో బంతిలో రనౌటైన నబీ 32 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. అఫ్గాన్ 6 వికెట్లకు 186 పరుగులు చేయగా, జింబాబ్వే బౌలర్లలో తినాషే పన్యంగార 32 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. తిరిపానో, సీన్ విలియమ్స్ చెరొక వికెట్ సాధించారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 26 పరుగుల స్కోరు వద్ద కెప్టెన్ హామిల్టన్ మసకజా (11) వికెట్‌ను కోల్పోయింది. ఆతర్వాత మళ్లీ కోలుకోలేక, ఒకదాని తర్వాత మరొకటిగా వికెట్లు చేజార్చుకుంది. టెయిలెండర్ పన్యంగార అజేయంగా చేసిన 17 పరుగులే టాప్ స్కోర్ కావడం జింబాబ్వే బ్యాటింగ్ పతనానికి నిదర్శనం. ఏ దశలోనూ అఫ్గాన్‌కు గట్టిపోటీ ఇవ్వలేకపోయిన జింబాబ్వే ఓవర్ల కోటాను కూడా పూర్తిచేయలేక, 19.4 ఓవర్లలో 127 పరుగులు చేసి ఆలౌటైంది. అఫ్గాన్ బౌలర్ రషీద్ ఖాన్ కేవలం 11 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. హమీద్ హసన్ కూడా 11 పరుగులే ఇచ్చి, రెండు వికెట్లు సాధించాడు. దవ్లత్ జద్రాన్, సమీయుల్లా షెర్వానీ, మహమ్మద్ నబీ తలా ఒక వికెట్ పడగొట్టారు. అర్ధ శతకంతో రాణించిన నబీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మెయన్ డ్రాలోకి ప్రవేశించిన అ ఫ్గాన్ తన మొదటి మ్యాచ్‌ని శ్రీలంకతో ఈనెల 17న కోల్‌కతా ఈ డెన్ గార్డెన్స్ మైదానంలో ఆడుతుంది.
మూడు జట్లు ఇంటికి
గ్రూప్ ‘బి’ నుంచి అఫ్గాన్ మెయన్ డ్రాకు అర్హత సంపాదించ డంతో, ఈ గ్రూప్‌లోని మిగతా జట్లు జింబాబ్వే, స్కాట్‌లాండ్, హాంకాంగ్ ఇంటిదారి పట్టాయ. ఎలాంటి ప్రయోజనం లేని మ రో గ్రూప్ మ్యాచ్‌లో శనివారం స్కాట్‌లాండ్, హాంకాంగ్ జట్లు ఢీకొన్నా య. వర్షం వల్ల అంతరాయం ఏర్పడిన ఆ మ్యాచ్‌ని స్కా ట్‌లాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో గెల్చుకుంది. హాంకాంగ్ 7 వికె ట్లకు 127 పరుగులు చేయగా, వర్షం కారణంగా ఆటకు అంతరా యం ఏర్పడడంతో స్కాట్‌లాండ్ లక్ష్యాన్ని 10 ఓవర్లలో 76 పరు గులుగా నిర్ణయంచారు. మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే స్కాట్‌లాండ్ లక్ష్యాన్ని ఛేదించింది.
ఇలావుంటే, గ్రూప్ ‘ఎ’లో బంగ్లాదేశ్, ఒమాన్ జట్లు చెరి మూ డు పాయంట్లతో సమవుజ్జీగా ఉన్నాయ. మిగతా రెండు జట్లు ఐ ర్లాండ్, నెదర్లాండ్స్ జట్లు చెరొక పాయంట్‌కు పరిమితం కావడం తో సూపర్-10కు అర్హత సంపాదించే అవకాశాన్ని కోల్పోయా య. ఆదివారం జరిగే అత్యంత కీలకమైన గ్రూప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్, ఒమాన్ జట్లు ఢీ కొంటాయ. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్-10లో స్థానం సంపాదిస్తుంది. ఇటీవల కాలంలో సంచలన విజయాలను నమోదు చేస్తున్న బంగ్లాదేశ్‌కు శుక్రవారం ఐర్లాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం ఇబ్బందుల్లోకి నెట్టింది. మ్యాచ్‌ని 12 ఓవర్లకు కుదించి, ఆలస్యంగా మొదలు పెట్టగా, బంగ్లాదేశ్ 8 ఓవర్లలో 2 వికెట్లకు 94 పరుగులు చేసింది. ఈదశలో మళ్లీ భారీ వర్షం కురవడంతో ఆటను నిలిపివేసి, మ్యాచ్ రద్దయనట్టు ప్రకటించారు. దీనితో ఒమాన్‌తో ఆదివారం జరిగే చివరి గ్రూప్ మ్యాచ్ ప్రాధాన్యతను సంతరించుకుంది. (చిత్రం) అర్ధ శతకంతో రాణించి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న అఫ్గాన్ బ్యాట్స్‌మన్ మహమ్మద్ నబీ
సంక్షిప్త స్కోర్లు
అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 (మహమ్మద్ షెజాద్ 40, సమీయుల్లా షెర్వానీ 43, మహమ్మద్ నబీ 52, తినాషె పన్యంగార 3/32).
జింబాబ్వే ఇన్నింగ్స్: 19.4 ఓవర్లలో 127 ఆలౌట్ (పన్యంగారా 17 నాటౌట్, సికందర్జ్రా 15, ఉసి సిబాండా 13, సీన్ విలియమ్స్ 13, రషీద్ ఖాన్ 3/11, హమీద్ హసన్ 2/11).