జాతీయ వార్తలు

గోసంరక్షణ పేరుతో దాడులుపై సుప్రీం కనె్నర్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: గోవుల సంరక్షణ పేరుతో కొందరు కార్యకర్తలు గుంపులుగా వ్యక్తులపై దాడిచేయటాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి దాడులకు పాల్పడేవారిపై చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని ఆదేశించింది. సామాజిక కార్యకర్త తెహసీన్ పునావాలా, మహాత్మాగాంధీ మనుమడు తుషార్‌గాంధీ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం హింసకు పాల్పడకూడదని పేర్కొంది. ఇలాంటి దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పార్లమెంట్ చట్టాన్ని రూపొందించాలని కోరింది.