జాతీయ వార్తలు

రోడ్డు ప్రమాదాలపై సుప్రీం ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్న వారి సంఖ్య అధికంగా ఉండటం పట్ల సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. సరిహద్దుల్లో ఉగ్రవాదుల చేతుల్లో చనిపోతున్నవారి సంఖ్య కంటే ఇది అధికంగా ఉందని పేర్కొంది. జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికపై జస్టిస్ మదన్ బి లోకూర్ ధర్మాసనం విచారణ చేపట్టింది. రహదారుల నిర్వహణ గురించి ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని ధర్మాసనం ఆగ్రహాం వ్యక్తంచేసింది. గత ఐదేళ్లలో 14,926మంది ప్రాణాలు కోల్పోవటం బాధాకరమని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. రహదారుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరణ ఇవ్వాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.