జాతీయ వార్తలు

సుప్రీం కోర్టు సీజేఐగా జస్టిస్ బోబ్డే ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్టప్రతి భవన్‌లో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ బోబ్డే 2021 ఏప్రిల్ 23 వరకు ఉంటారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్వీ రమణ తదితరులు హాజరయ్యారు. కాగా 1956 ఏప్రిల్ 24 మహారాష్టల్రోని నాగపూర్‌లో జన్మించిన శరద్ అరవింద్ బోబ్డే 1978లో మహారాష్ట్ర బార్ కౌన్సిల్‌లో తన పేరును నమోదు చేసుకున్నారు. బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్‌లో 25 సంవత్సరాలు న్యాయవాదిగా సేవలు అందించారు. బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తరువాత 2012 అక్టోబరు 16న మధ్యప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2013 ఏప్రిల్ 12న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అయోధ్య, ఆధార్ ఆర్టినెన్స్ జారీ, పౌరుల వ్యక్తిగత గోప్యత, ఆర్టికల్ 370 తదితర ప్రధాన కేసుల వాదనలో పాల్గొన్నారు.