జాతీయ వార్తలు

తమిళనాడుకు నీళ్లివ్వాల్సింథే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి:కావేరీ జలాల విడుదల విషయంలో కర్నాటకకు మరోసారి చుక్కెదురైంది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఈనెల 27వరకు తమిళనాడుకు రోజుకు 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉండగా అందుకు అంగీకరించని కర్నాటక నీటి విడుదల నిలిపివేతపై అసెంబ్లీలో తీర్మానం చేసింది. సుప్రీం తీర్పును పునస్సమీక్షించాలని కోర్టులో అపీల్ చేసింది. కాగా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించని కర్నాటక కోర్టు ధిక్కారానికి పాల్పడిందని తమిళనాడు ఆరోపిస్తూ మరో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ ప్రారంభించిన అత్యున్నత న్యాయస్థానం నేడు, రేపు 6వేల క్యూసెక్కుల చొప్పున నీటిని తమిళనాడుకు విడుదల చేయాల్సిందేనని స్పష్టం చేసింది. రాజ్యాంగంలో ఏ అధికరణం ప్రకారం మీరు అసెంబ్లీలో తీర్మానం చేశారని ప్రశ్నించింది. నీటి నిల్వలు తగినంత లేవని, ఇప్పటికిప్పుడు నీటిని విడుదల చేయలేమని కర్నాటక గట్టిగా చెప్పినా ప్రయోజనం లేకపోయింది. కాగా ఈ విషయంలో కేంద్రం ఏం చెబుతుందని ధర్మాసనం ప్రశ్నించగా ఈ విషయంలో ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని ఎజి తెలిపారు. కాగా విచారణను 29వ తేదీకి వాయిదా వేశారు.