జాతీయ వార్తలు

సుప్రీంను ఆశ్రయించనున్న కాంగ్రెస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేషనల్ హెరాల్డ్ కేసులో హైకోర్టు జడ్జి వ్యాఖ్యల తొలగింపునకు సోనియా, రాహుల్ యత్నం!

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి చేసిన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా మరికొంతమంది కాంగ్రెస్ నేతలు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, జస్టిస్ సునీల్ గౌర్ చేసిన కొన్ని ప్రతికూల వ్యాఖ్యలను తొలగించడానికి సంబంధించి పరిమిత అవసరం కోసమే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని అనుకుంటున్నామే తప్ప కిందికోర్టులో విచారణను నిలిపివేయాలని మాత్రం కాదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. తమకు కింది కోర్టు జారీ చేసిన సమన్లను కొట్టివేయాలని కోరుతూ సోనియా, రాహుల్‌లు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సునీల్ గౌర్ ‘కేసు మొత్తాన్ని పరిశీలించిన తర్వాత స్పెషల్ పర్పస్ వెహికిల్ అంటే యంగ్ ఇండియా లిమిటెడ్ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (నేషనల్ హెరాల్డ్ ప్రచురణ సంస్థ)ను స్వాధీనం చేసుకోవడానికి పిటిషనర్లు అనుసరించిన తీరు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, యంగ్ ఇండియా లిమిటెడ్, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌లోని వ్యక్తులంతా ఒకటే అయినప్పుడు వారు అనురించిన తీరు వారి నేరపూరిత ఉద్దేశాన్ని తెలియజేస్తోందని చెప్పడానికి ఏమా త్రం సందేహించడం లేదు’ అని తన ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ కేసులో పిటిషనర్లకు సమన్లు జారీ చేయకుండా ఉండడానికి ఎలాంటి కారణా లు కనిపించడం లేదని పేర్కొన్న జ డ్జి, పిటిషనర్లపై మోపిన అభియోగా లు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని తన 29 పేజిల ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.(చిత్రం) నేషనల్ హెరాల్డ్ కేసులో పటియాలా హౌజ్ కోర్టుకు హాజరై బయటకు వస్తున్న కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్