జాతీయ వార్తలు

అదుపు తప్పిన కాలుష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహుముఖ వ్యూహం అవసరం ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం చేయిదాటి పోయే స్థాయికి చేరుకుందని సుప్రీంకోర్టు గురువారం వ్యాఖ్యానిస్తూ, నిత్యావసర సరకులను తీసుకువచ్చేవి తప్ప మిగతా అన్ని డీజిల్ ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధించే విషయాన్ని పరిశీలించడానికి అంగీకరించింది. అదే సమయంలో సమస్యతో సంబంధం ఉన్న అందరు భాగస్వాములతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన కనీస ఉమ్మడి కార్యక్రమాలతో ముందుకురావాలని కేంద్రాన్ని కోరింది. దేశ రాజధాని ఢిల్లీలో తారస్థాయికి చేరిన కాలుష్యం గురించి నగరాన్ని సందర్శించే విదేశీ ప్రముఖులు వ్యాఖ్యానించినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వచ్చే జనవరి 1నుంచి వారంలో మూడు రోజులు సరి నంబర్లు, మరో మూడు రోజులు బేసి నంబర్లున్న ప్రైవేటు కార్లను మాత్రమే అనుమతించాలన్న ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్, జస్టిస్ ఆర్ బానుమతిలతో కూడిన బెంచ్ సమర్థిస్తూ, అది ఒక అత్యవసర చర్య మాత్రమేనని వ్యాఖ్యానించింది.
ఢిల్లీలో కాలుష్యం స్థాయి పెరిగిపోవడాన్ని చాలా తీవ్రమైన అంశంగా బెంచ్ అభివర్ణిస్తూ, పరిస్థితిని ఎదుర్కోవడానికి బహుముఖ వ్యూహం అవసరమని స్పష్టం చేసింది. అంతేకాదు భరించలేని స్థాయికి చేరుకున్న కాలుష్యం ఢిల్లీ నగరానికి ‘ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం’ అనే చెడ్డపేరును సైతం తీసుకువచ్చిందని బెంచ్ వ్యాఖ్యానించింది. ఢిల్లీ సందర్శించే విదేశీ ప్రముఖులు దేశ రాజధానిలో పెరిగిపోయిన కాలుష్యం గురించి వ్యాఖ్యానించినప్పుడు తమకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని అంటూ, అంతర్జాతీయ న్యాయస్థానానికి చెందిన ఒక జడ్జి ఈ అంశాన్ని ప్రస్తావించిన విషయాన్ని ఉదహరించింది. ఇప్పటికే పూర్తిగా విషమించిన వాతావరణంలో ఏదయినా చెప్పుకోదగ్గ మార్పు వస్తుందేమో పరిశీలించడానికి తాత్కాలిక చర్యగా ఆరువారాల పాటు డీజిల్‌తో నడిచే అన్ని రకాల ట్రక్కులు నగరంలోకి ప్రవేశించడంపై నిషేధం విధించాలని ఈ కేసులో కోర్టుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే చేసిన సూచనను పరిశీలించడానికి బెంచ్ అంగీకరించింది. 2001లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా నిత్యావసర సరకులను తీసుకువచ్చే ట్రక్కులు తప్ప మిగతా అన్ని ట్రక్కులను నిషేధించవచ్చని సాల్వే అన్నారు. ‘ఈ సమస్యను అదుపు చేయడానికి సమస్యతో సంబంధం ఉన్న భాగస్వాములందరికీ ఒక ప్లాట్‌ఫామ్‌ను మీరు (కేంద్రం) అందించగలిగితే మేము ఎంతో సంతోషిస్తాం’ అని బెంచ్ అంటూ, కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సలహాలను కోరింది. డీజిల్‌తో నడిచే కార్లు ట్రక్కులే కాకుండా భవనాల నిర్మాణం, వ్యర్థ పదార్థాలను తగులబెట్టడం కూడా ఢిల్లీని కాలుష్య నగరంగా చేస్తున్నాయని అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా అన్నారు.