సంజీవని

సర్జరీతో చెవులకు కొత్తరూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖంమీద వుండే కళ్ళు, ముక్కే కాదు, తలకి అటూ ఇటూ వుండే చెవులు ముఖానికి అందాన్ని కలిగించగలవు. అనాకారితనాన్ని కలిగించగలవు. చెవి వినడానికే కాదు మన ముఖారవిందాన్ని పెంచడానికి తోడ్పడుతుంది. చెవుల పరిమాణం నిండుగా వుంటే ముఖం నిండుగా వుంటుంది.
కొంతమందిలో బైటి చెవి పెద్దదిగా వుండి ముందుకు వంగి దొప్పలా వుంటాయి. ఇంకొందరిలో చెవులు చాలా చిన్నవిగా వుంటాయి. మరికొందరిలో బైటి చెవి పూర్తిగా పెరగదు. ఆడపిల్లలకి అందం ముఖ్యం కాబట్టి వారి చెవి నిర్మాణం బాగుండకపోతే ప్లాస్టిక్ సర్జన్ సాయంతో శస్త్ర చికిత్స ద్వారా చెవి పునర్ నిర్మాణం చేయవచ్చు.
బయటి చెవి కార్టిలెజ్ చర్మంతో నిర్మితమవుతుంది. అందుకే మెత్తగా వుంటుంది. కొందరిలో చెవి కింద తమ్మెలు చాలా చిన్నవిగా వుండవచ్చు, ఆభరణాలేవీ పెట్టుకునే వీలు లేకుండా. అలాంటి తమ్మెల్ని పెంచవచ్చు. కొంతమంది తమ్మెలలో కంతలు బరువైన ఆభరణాలను పెట్టడంవల్ల బాగా సాగిపోయి వుంటాయి. కొందరిలో తెగిపోయి వుంటాయి. ఇటువంటి తమ్మెల్ని ఆటో ప్లాస్టీలో సరిచేస్తారు. అవసరం అయితే చెవి మొత్తాన్ని పునర్ నిర్మాణం చేయవచ్చు. చెవిలో కొద్ద్భిగానే్న పునర్ నిర్మించాల్సి వచ్చినపుడు రెండో చెవిలోని కార్టిలెజ్‌ని తీసుకుంటారు. ఎక్కువభాగం పునర్ నిర్మించాల్సివస్తే రిబ్స్ ప్రాంతంనుంచి కార్టిలెజ్ తీస్తారు. తలపైభాగం నుంచి స్కల్ప్‌నుంచి చర్మం తీస్తారు. చెవి కంతలు పెద్దవైతే పార్థు టెక్నిక్‌తో రంధ్రాన్ని చిన్నదిగా, మామూలుగా చేస్తారు. ఈ శస్త్ర చికిత్సలో రక్తస్రావం వుండదు, ఇన్‌ఫెక్షన్స్ రావు, మానడానికి వారం రోజులు పడుతుంది.

-డా.శశికాంత్ మద్దు ప్లాస్టిక్ సర్జన్, యశోద సూపర్ స్పెషాలిటీ 9581258179