క్రీడాభూమి

ప్రో రెజ్లింగ్ నుంచి వైదొలగిన సుశీల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: భారత స్టార్ రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ ప్రో రెజ్లింగ్ లీగ్ (పిడబ్ల్యుఎల్) నుంచి వైదొలగినట్టు తెలుస్తోంది. అతనికి అత్యంత సన్నిహిత వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం భారత క్రికెటర్ రోహిత్ శర్మ సహ భాగస్వామిగా ఉన్న ఉత్తర ప్రదేశ్ వారియర్స్ జట్టు సుశీల్‌ను 38 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. కాగా, వేలం మొదలైనప్పటి నుంచి టోర్నీ ఆరంభం వరకు వారియర్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరి సుశీల్‌కు ఆగ్రహం తెప్పించింది. అందుకే ఈ టోర్నీలో పాల్గొనరాదని అతను నిర్ణయించుకున్నాడు. అటు సుశీల్‌గానీ, ఇటు వారియర్స్ ఫ్రాంచైజీగానీ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, సుశీల్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాడని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోడని అతని సన్నిహితులు తెలిపారు.