జాతీయ వార్తలు

మరోసారి వార్తల్లోకి హర్జీత్ హసీహ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్‌దాస్‌పూర్: 2014లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇరాక్‌లోని మసూల్‌లో కిడ్నాప్ చేసిన భారతీయ కార్మికుల్లో 39 మంది ఐఎస్ ఊచకోతకు గురై మరణించినట్టు, వారి అవశేషాలు లభ్యమైనట్టు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మంగళవారంనాడు రాజ్యసభలో తొలిసారి ప్రకటించిన నేపథ్యంలో హర్జీత్ హసీహ్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల చెర నుంచి నాలుగేళ్ల క్రితం తప్పించుకుని బయట పడిన ఏకైక భారతీయ కార్మికుడు హర్జీత్ మసీహ్. కాలికి బుల్లెట్ గాయమైనప్పటికీ ఎలాగో అక్కడి నుంచి తప్పించుకుని అతను బయటపడ్డారు. పంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్‌కు చెందిన హర్జీత్ తానొక్కడే ఎలా బయటపడిందీ 2017లో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. తన తోటి సహచరులందరినీ ఐఎస్ ఊచకోత కోసినట్టు హర్జీత్ ఆనాడే చెప్పినా... కేంద్ర ప్రభుత్వం మాత్రం 39 మంది భారతీయుల జాడ తెలియలేదనే చెబుతూ వచ్చింది. ఇవాళ కాకపోతే...రేపు అయినా నిజం బయటకు రాకతప్పదు' అని హర్జీత్ 2017లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్ధలు కొట్టారు.