జాతీయ వార్తలు

ట్వీట్‌లో సుష్మాస్వరాజ్ పొరపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ఓ ట్వీట్‌లో చిన్నపొరపాటు చేశారు. వెంటనే ఆ విషయం గ్రహించి ట్వీట్ తొలగించినప్పటికీ అప్పటికే యూజర్ల నుంచి ఆమె కామెంట్లు ఎదుర్కోవలసి వచ్చింది. ప్రముఖ రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి మహాశ్వేతాదేవికి నివాళులర్పిస్తూ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్వీట్‌ చేశారు. మరో ట్వీట్‌లో మహాశ్వేతాదేవి రచించిన 'ప్రథమ్‌ ప్రతిశ్రుతి', 'బకుల్‌ కథ' పుస్తకాలు తన జీవితంపై చెరగని ముద్ర వేశాయని సుష్మ పేర్కొన్నారు. మహాశ్వేతాదేవి రచించారంటూ సుష్మ ట్విట్టర్లో పేర్కొన్న ఆ రెండు పుస్తకాలనూ ఆమె రాయలేదు. వాటిని మరో రచయిత్రి ఆశాపూర్ణాదేవి రచించారు. తన పొరబాటును గ్రహించిన సుష్మ వెంటనే రెండో ట్వీట్‌ను డిలీట్‌ చేశారు.