ఆంధ్రప్రదేశ్‌

రోజాపై సస్పెన్షన్‌కు కమిటీ సిఫారసు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వైకాపా ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలంటూ సభాహక్కుల సంఘం సిఫారసు చేసింది. ఈ సిఫారసును ఆమోదించేందుకు సోమవారం ఉదయం ఎపి అసెంబ్లీలో చర్చ జరగనుంది. తమ ఎదుట రోజా హాజరుకాకపోవడాన్ని కూడా సభా హక్కుల సంఘం సభ్యులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. వైకాపా ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జ్యోతుల నెహ్రూ, కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డిలను మందలింపుతో సరిపెట్టాలని సభా హక్కుల సంఘం నిర్ణయించినట్లు సమాచారం. కాగా, వైకాపా ఎమ్మెల్యే కొడాలి నానిపై చర్యతీసుకునే అధికారాన్ని శాసనసభకు వదిలిపెట్టాలని హక్కుల సంఘంలో సభ్యులు తీర్మానించారు.