గుంటూరు

పొందుగల అంతరాష్ట్ర చెక్ పోస్టుపై ఏసీబీ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* 68 వేల అదనపు నగదు స్వాధీనం
దాచేపల్లి , నవంబర్ 27: ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో దాచేపల్లి మండలం పొందుగల వద్ద వున్న కమర్షియల్ ట్యాక్స్ చెక్‌పోస్టుపై శుక్రవారం తెల్లవారుఝామున ఎసిబి అధికారులు దాడులు నిర్వహించి చెక్‌పోస్టు కార్యాలయంలో అదనంగా వున్న రు.68వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు ఎసిబి డియస్‌పి చంద్రవంక దేవానంద్ శాంతో కథనం ప్రకారం వివరాలు ఇలా వున్నాయి. పొందుగల అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద ఒక్కో వాహనానికి రు.50 వసూలు చేయవలసి వుండగా అక్కడి సిబ్బంది దీనికి మూడు రెట్లు అదనంగా రు.150 వసూలు చేస్తున్నారు. ఈ విషయంపై లారీల డ్రైవర్లు, వాహనాల యజమానుల నుండి ఎసిబికి పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుఝామున ఎసిబి అధికారులు అకస్మాత్తుగా పొందుగల చెక్‌పోస్టుపై దాడి చేశారు. కార్యాలయ రికార్డులను పరిశీలించి నగదును తనిఖి చేయగా అదనంగా రు. 68వేలు వున్నట్లు గుర్తించారు. అదనంగా వున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎసిబి డియస్‌పి చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా లంచం డిమాండ్ చేస్తూ తమకు వివరాలు అందించవచ్చునని ఆయన తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా వుంచి సంబధిత అధికారులపై దాడులు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎసిబి డియస్‌పి దేవానంద్ శాంతో తెలియజేశారు.