స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
ఇక విశ్వసృష్టిలో అసంఖ్యాకంగా ఉన్న భూమండలాల మహిమ- ఘన ఎంత ఉంది ఊహించగలమా? కనీసం మనిషి దానిని మనసు చేత ఊహామాత్రమైనా చేయగలదా?
భూమిలాగే ఆకాశాన్ని కొంచెం పరిశీలిద్దాం రండి. భూమి ఈ సృష్టిలో ఒక చిన్న ద్వీపమైతే ఆకాశమొక మహాసాగరం.
మనం ప్రతిరోజు చూచే సూర్యుడు భూమికంటే నాలుగున్నర లక్షల రెట్లు బరువు కలవాడని శాస్తజ్ఞ్రులు చెబుతున్నారు. అట్లే ఆ సూర్యుడు మన భూమితో సమానమైన పదమూడు లక్షల భూమండలాలతో సమానమని వారే చెబుతున్నారు. అంతేకాదు, మన ఈ మహాభూమండలం ఆ సూర్యుని నుండే పుట్టిందని కూడా శాస్తజ్ఞ్రుల నిర్థారించారు. అంతే ఆ ఆకాశ మహాసాగరంలో మన భూమి ఒక చిన్న తామరపూవు వంటిది మాత్రమే. అట్టి అనంత మహా ఆకాశవీధిలో మహామహా సూర్యగోళాలు ఎనె్నన్నో మినుకు మికుమంటూ వెలుగుతున్నాయి.
మరి వాటి శక్తి ఎంతటిదో నీవు ఊహించగలవా? ఓహ్‌హ్.. అనంత ఆకాశాలు - అనంత భమండలాలు అనంత సూర్యగోళాలు కలిసి కూడా అనంత మహిమాన్వితుడైన భగవానుని చెంత నిలువజాలవు. అంటే ఆయన సన్నిధిలో అవన్నీ కూడా చాలా అల్పమైనవే.
అందుకే యజుర్వేదం- ఈ సమస్త సృష్టిజాలమూ భగవానుని మహిమా సమన్వితమే. పరిపూర్ణమైన ఆ శక్తి కంటే ఘనమైది అద్భుతమైనది మరొకటి ఏమున్నది? అని భగవానుని శ్లాఘించింది.
అసలు భగవంతుడు విశాలమైన బ్రహ్మాండాలనే రీతిగా సృజించాడు? ఈ ప్రశ్నకు సమాధానంగా-
విశ్వకర్త పూర్వం సృష్టి రచనలో చేసిన రీతిగా సూర్యచంద్రులను, ద్యావాపృథువులను, స్వర్లోకాదులోని ఆనందాన్ని పూర్వంలాగానే మరల పునః సృష్టి చేశాడు అని ఋగ్వేదం వివరించింది. మరి ఆ విధంగా సృష్టింపబడిన జీవులు జడలోకాలు సృష్టించిన పరమేశ్వరున్ని ఎలా పొందగలవు? పొందలేవని-
సూర్యచంద్రులు, నక్షత్రాలు, విద్యుత్కాంతులు ఆ భగవానుని ఎదుట ప్రకాశింపజాలవు. ఇక అగ్నిమాట చెప్పనేల? ఆ సమస్తమూ ఆయన ప్రకాశం చేతనే కాంతివంతమై వెలుగొందుతున్నాయి అని కఠోపనిషత్తు వ్యాఖ్యానించింది. అంటే సూర్యచంద్రాదులన్నీ కూడినా ఆ భగవానునకు సమానం కావన్నమాట. దీనిని బట్టి బ్రహ్మాండంలో పరంధామునకు తుల్యమైనది, తుల్యమైనవాడు లేదని, లేడని స్పష్టం.