స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-112

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవుని మహదైశ్వర్యమంతా ఉత్తమ జీవుల కొఱకే
అధ గ్మంతా నహుషో హవం సూరేః శ్రఓతా రాజానో అమృతస్య మంద్రాః
న భోజువో యన్నిరవస్య రాధః ప్రశస్తయే మహినా రథవతే
భావం:జ్ఞానవంతులైన ప్రజలారా! ఇపలుడు మానవుడు జ్ఞానియైన విద్వాంసుని మాటననుసరించయే నడుచుకొంటున్నాడు. జీవన మాధుర్యం మరియు జీవన పరమార్థమై మోక్షానందాన్ని అనుభవించడం చేత తన్మయులై వినిపించే వారి గానామృతాన్ని వినండి. ఎందుకంటె జ్ఞాన ప్రదాతయైన జగదీశ్వరుని ఐశ్వర్యమంతా బహత్వపూర్ణమైన-కీర్తనీయమైన శరీరధరాణ చేసిన మానవుల కొఱకే.శరీరంతో, ధనంతో, మాటతో చేసే యజ్ఞమే సంపూర్ణ యజ్ఞమవుతుంది.
వివరణ: జ్ఞాని సర్వజనుల కోసం జ్ఞాన ప్రకాశాన్ని నిస్వార్థంగా విరజిమ్ముతూనే ఉంటాడు. కాని దానినెవ్వరు గుర్తించరు. ఎవరో కొద్దిమంది మాత్రమే ఆ జ్ఞాని జ్ఞాన ప్రబోధానికి చెవి యొగ్గుతారు. నిజంగా జనులందరూ ఆ జ్ఞాని మాటలను శ్రద్ధతో వినే పక్షంలో ‘ఊర్థ్వబాహుర్విరోమ్యేష న చ కశ్చిత్ శృణోతి మే- నా మాటలను వినండహో అంటూ చేతులెత్తి గట్టిగా అరచి చెబుతున్నా నా మాటను ఎవరూ వినడంలేదు అని వేదవ్యాసుడు ఎందుకు బాధపడతాడు? కాని మనిషి ఏదో ఒకరోజు వింటాడు. ఎప్పుడు? జీవన ప్రయాణంలో గట్టి ఎదురుదెబ్బ తగిలినపులడు. ‘అధ గ్మంతా నహుషో హవం సూరేః’- ఇపుడు మనిషి జ్ఞాన మార్గంలో నడుస్తాడు అని శ్రుతి మనిషిలోని జ్ఞాన ప్రబోధం పట్లుండే అలస భావాన్ని పేర్కొంది. అట్టి అలసులైన జనుల ఎడల ప్రేమ మూర్తి అయిన వేదం ‘శ్రోతా రాజానో అమృతస్య మంద్రాః’ జ్ఞాన ప్రకాశం చేత వెలిగే జనులారా! జీవితం శ్రుతిలయాత్మకమైన మధుర గానం వంటిది. ఆ మధుర గానాన్ని శ్రద్ధగా వినండి అంటూ లాలనగా హితబోధ చేసింది. ఆ గానమెక్కడ నుండి వినవస్తుంది? అంటే లోకాధ్యక్షుడైన పరమేశ్వరుని సృష్టినుండియే. ఆ సృష్టి - ఆ గానమంతా భగవానుని మహదైశ్వర్యమంతా మహత్వపూర్ణమూ కీర్తినీయమూ అయిన శరీర ధారుల కొరకేనంటూ ‘న భోజువో .. రథవతో’ అని సృష్టి మర్మాన్ని జ్ఞాన మాతృక (వేదం) విప్పి చెప్పింది.
మరి వేదమాత చెప్పిన మహత్వపూర్ణమూ కీర్తనీయమూ అయిన ఆ శరీరధారులెవరు? అని విచారింపవలసియుంది. భుక్తి- ముక్తి ప్రదాయకమైన ఈ సృష్టి సర్వశరీరధారులదే. అందుకే సర్వేశ్వరుడు సృష్టి చేసింది కూడా. అయితే ఈ సృష్టిని భోగానికి వినియోగించుకోవడమా? లేక జీవన లక్ష్యాన్ని గుర్తించి ఈ శరీరంతో ముక్తిని సాధించడమా?అన్నది జీవుడి స్వేచ్ఛకే విడిచివేయబడింది కాని ఎవరి ఇచ్ఛ వారి వర్ణ సంబంధమై ముక్తిసాధన కోసం జనిస్తుంద అతడి రథం = శరీరం ఉత్తమమైనది. మహత్వపూర్ణమైనది. కీర్తనీయమైనది. అట్టి శరీర ధారులకే భగవంతుడు సృష్టి నిర్మాణం చేసింది. అంటే ఆత్మోద్ధరఓణ పరాయంలైన వారి కొఱకే ఈ ఈశ్వర సృష్టి ఉన్నది. యోగదర్శనం కూడా ‘తదర్థ ఏవ దృశ్యస్యాత్మా- ఈ సృష్టి ఉన్నది ఆత్మోద్ధార పరాయణుల కొరకు మాత్రమేనని చెప్పింది. అట్టివారికి ముక్తితోబాటు భుక్తిని కూడా ప్రసాదించేందుకే భగవంతుడు సృష్టి చేస్తాడు.
జీవులు ఇట్టివారేగాని మరెవరైనా గాని ఈశ్వరుడు సృష్టి చేసింది జీవుల కొరకు మాత్రమే. ఈ మంత్రంలో మరొక రహస్యానికి కూడా సమాధానం చెప్పబడింది. కంటికి కానవచ్చే ఈ జగత్ సృష్టి పరమ ప్రయోజనాన్ని (జీవుల కొరకే అన్నది) సుస్థిరం చేసేందుకు ఎందరెందరో ఎనె్నన్నో యుక్తులతో నిత్యమూ పరిశ్రమిస్తూ ఉన్నారు. కాబట్టి జీవుల (మానవుల) శక్తి, సామర్థ్యాలను గుర్తించకుంటె సమాధానం లభించదు. ఈ విషయంగా వేదం సుందరంగా సమాధానాన్ని చెప్పింది.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు