స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-113

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రాధః ప్రశస్తయే మహినా రథవతే’- ఈ సృష్టిలోని వైభవమంతా మహత్వపూర్ణమైన శక్తి సామర్థ్యాలతో కూడిన ‘ప్రశస్తరథవాన్’ = శ్లాఘనీయమైన శరీర సౌష్టవంగల జీవుల (మానవుల) కొరకు మాత్రమేనని. మరి ఆ శ్లాఘనీయమైన శరీరం గలవారు (ప్రశస్త శరీరవాన్) ఎవరు?అంటే ఉత్తమమైన కర్మలను చేయడంవలన పవిత్రమైన శరీరం కలవాడరేనని భావం. కాబట్టి ఓ మానవులారా! పవిత్రత చేత సాధించుకొన్న శక్తి సామర్థ్యాలు గల సుందర శరీరంకలవారు కండి, ఉత్తమ కర్మ చేయండి. మీకై భగవానుడు సృష్టించిన ఈ సృష్టిలోని భుక్తి- ముక్తి వైభోగాలను పొంది ఆనందించండి.
దాత మహాత్మ్యం
స వ్రాధతో నహుషో దంశుజూతః శర్థస్తరో నరాం గూర్తశ్రవాః
విసృష్టరాతిర్యాతి బాళ్హసృత్వా విశ్వాసు పృత్సు సదమిచ్ఛూరః

భావం:- శత్రు- మిత్ర భేదం లేకుండ అందరకు సంప్రీతితో దానం చేసే దానశూరుడు దైవోపాసకుల తేజస్సుతో సమానమైన తేజస్సుతో వెలిగిపోతూ మహాబలశాలియై, ఘనకీర్తిశాలియై, అజాతశత్రువుగా సమస్త భూముల్లో ఎప్పుడైనా స్వేచ్ఛగా సంచారం చేయగలడు.
వివరణ:- వైదిక ధర్మంలో దానం ప్రశస్తమైన ధర్మం. ధర్మం చేయని లోభిని వేదం ‘అరాతి’అని నిందించింది. లౌకిక సంస్కృత సాహిత్యంలో ‘అరాతి’ శబ్దానికి శత్రువని అర్థం. దానం చేయనివాడు సమాజానికి నిజంగా శత్రువే. దానం యజ్ఞానికి ఒక ప్రధానాంశం. ధర్మవృక్షానికొక శాఖ. ఎవడు ధర్మాన్ని= సమాజ నియమాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తాడో ఆతడు సమాజ సమత్వానికి చేరుపుచేసేవాడే కాబట్టి ఆతడు సమాజం పట్ల శత్రువే.
దానం చేసే విధానాలెనె్నన్నో వెనుక 84వ మంత్ర వ్యాఖ్యలో ధనం- శరీరం మరియు మాటను దానం చేయడం ద్వారా యజ్ఞమై యజ్ఞ సాఫల్యసిద్ధి చేకూరుతుందని చెప్పబడింది. తనకు సంపూర్ణ్ధాకారం గల వస్తువుమీద అధికారాన్ని విడిచి ఇతరులకు అధికారాన్ని కట్టబెట్టడమే దానం. మనిషి అన్నీ దానం చేయగలడు. చివరకు అవసరమైతే శరీరాన్ని కూడ దానం చేయగలడు. కాని అహంకార, మమకారాలను మాత్రం త్యాగం చేయజాలడు. కాని త్యాగం చేయడానికి సాధ్యంకాని అహంకార, మమకారాలను మనస్ఫూర్తిగా త్యాగం చేసి తననుతాను సర్వేశ్వరుడి కెవడు సమర్పించుకొంటాడో అతడిని ఆయన తన దివ్యతేజస్సుతో పరిపూర్ణుణ్ణి చేసి దివ్య తేజోవంతునిగా చేస్తాడు. శాస్త్రంలో ఆ దివ్య తేజస్సు పేరే బ్రహ్మవర్చస్సు. అందుకే వేదర్షి మహాదానియైన మనుజుడు ‘వ్రాధతో నహుషో దంశుజూతః’ భగవదుపాసకుడు దివ్యతేజస్సుతో దేదీప్యమానుడై వెలిగిపోతాడని ప్రశంసించాడు. అందుచేత అతడు శర్ధస్తరః = మహాబలవంతుడు కాగలడు మరియు ‘నరాల గూర్త శ్రవాః’= సమస్త జనులచేత కీర్తినీయుడు ఆగలడని వేదం దానశీలుణ్ణి బహుధా ప్రశంసించింది. అంతేకాక ‘ఉతాపరీషు కృణుతే సఖాయమ్’ (ఋ.10-117-3) ఆపత్సమయాలలో అందరికి అతడు మిత్రుడవుతాడని వితరణశీలి సచ్చరిత్రను వివరించింది. దాతకు మిత్రుల లోటు ఉండనే ఉండదు. అందుచేత అతడు ‘విసృష్టరాతిర్యాతి... పదమిచ్ఛూరః’ దానశూరుడై సమస్త రణభూములలో స్వేచ్ఛగా సంచరించగలడు. అతడొక్కడే కాదు ఆతని వెంట ఆయన మిత్రులు, సహచరులు, సహాయకులు అలా ఎందరెందరో నిర్భయంగా తిరుగగలరు.
కాబట్టి ఆత్మార్పణబుద్ధితో తనది అన్నదానినంతా దానం చేసుకొంటే అతడికి గొప్ప మిత్రులు లభిస్తారు. అతడికి భయమన్నది ఉండనే ఉండదు. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు